Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగులు ఓటేసేందుకు వీల్ చైర్, ఒక సహయకుడిని ఏర్పాటు చేయాలి

దివ్యాంగులు ఓటేసేందుకు వీల్ చైర్, ఒక సహయకుడిని ఏర్పాటు చేయాలి

- Advertisement -

– విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ 
నవతెలంగాణ – కామారెడ్డి

దివ్యాంగులకు ఓటు వేసే సమయంలో వీల్ చైర్, ఒక సహాయకున్ని ఏర్పాటు చేయాలని విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునే సమయాల్లో ప్రత్యేక చొరవ తీసుకుని వారికి వీల్ చైర్, అవసరమైతే ఒక సహయకుడిని ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను కోరారు.

మొదటి విడత పోలింగ్ కేంద్రాల్లో కోంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు కావున మలివడిత పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చొరవ తీసుకుని వారికి అవకాశం కల్పించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేసినట్లు వలస ఓటర్లకు పోటీ చేసే అభ్యర్థులు మానవతా దృక్పథంతో ఒక పూట భోజనం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కమిటీ సభ్యులు పంగ ఈశ్వర్, నితిశ్ రెడ్డి, రంగ్యనాయక్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -