- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కడుపు నొప్పి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే ఏకంగా కిడ్నీ తొలగించారు. మహారాష్ట్రలోని థానేలోని న్యూ లైఫ్ కేర్ ఆసుపత్రికి అలావుద్దీన్ కడుపునొప్పిగా ఉందని వెళ్లాడు. అక్కడ ఆపరేటర్లు ఇమాముద్దీన్, తార్ మొహమ్మద్ కిడ్నీల రాళ్లు ఉన్నాయని శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు. సర్జన్ లేకుండా రాత్రిపూట స్వయంగా ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించారు. కొన్ని రోజుల తర్వాత రోగి మళ్లీ ఆసుపత్రికి వెళ్లాడు. అల్ట్రాసౌండ్ టెస్ట్ లో కిడ్నీ లేదని వెల్లడైంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
- Advertisement -