నవతెలంగాణ – ములుగు
మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం మరియు బాలల దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తమ బోధనతో అందరినీ ఆకట్టుకున్నారు. భారత దేశపు మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ప్రిన్సిపాల్ శ్రీలత మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందన్నారు. ఉపాధ్యాయ వృత్తి విలువలు ఈ కార్యక్రమం ద్వారా బాగా అవగతమవుతాయని చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



