Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ..

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ..

- Advertisement -

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం..
నవతెలంగాణ – ఊరుకొండ 

ఊరుకొండ మండల కేంద్రంలోని శ్రీ వేంకట బాల్ రామయ్య పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాత్రలు పోషించి తోటి విద్యార్థులకు విద్యాబుద్దులు బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ సామల తిరుపతయ్య మాట్లాడుతూ ప్రపంచంలో గురువు స్థానం చాలా గొప్పదని.. వారి సేవ సమాజానికి ఎంతో విలువైనదని తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ సామల బాల్ రాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి కాదు, సేవ అని కొనియాడారు. దాదాపు 60 పై చిలుకు విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాత్రలు పోషించారు. ఉన్నతమైన అధికారుల పాత్రలు కూడా పోషించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జార్జ్ జోసెఫ్, వైస్ ప్రిన్సిపాల్ రామ్, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -