Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళా..

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళా..

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవంగర
మండలంలోని పోచారం ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.‌ పాఠశాల విద్యార్థులే ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి, తోటి విద్యార్థులకు చక్కగా పాఠ్యాంశాలు బోధించి ఆకట్టుకున్నారు. కలెక్టర్ గా కె.వర్షిని, హెచ్ఎం గా రిషిత, ఉపాధ్యాయులుగా వైష్ణవి, రాకేశ్వర్, మాధురి, సిరివెన్నెల, వైష్ణవి వ్యవహరించి అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బాలారాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితయడానికి ఇలాంటి‌ కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సీతారాం నాయక్, కార్యదర్శి మణికుమార్, ఏఏపీసీ చైర్మన్ అనూష, వార్డు సభ్యులు మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -