Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ఎప్పుడిస్తారు?

గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ఎప్పుడిస్తారు?

- Advertisement -

నిధులను వెంటనే విడుదల చేయాలి:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు గురౌతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. వృత్తిలో భాగంగా అనేక విధాలుగా వారు ప్రమాదాలకు గురౌతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రమాదాలకు గురైన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా హామీలే తప్ప అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రమాదా లకు గురైన వారికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కాలంలో దాదాపు 710 మంది వృత్తిదారులు ప్రమాదాలకు గురైతే 130 మంది చనిపోయారని వివరించారు. 120 మంది శాశ్వత వికలాంగులయ్యారని తెలిపారు. సుమారు 460 మంది వికలాంగుల య్యారని పేర్కొన్నారు. వారికి రూ. 12.96 కోట్ల నిధులను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నదని విమర్శించారు. ఎక్స్‌గ్రేషియా నిధులను విడుదల చేయాలని గీత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ఆందోళనలు, నిరాహార దీక్షలు జరిగాయని గుర్తు చేశారు. అధికారులను కలిసినా ప్రయోజనం లేదని తెలిపారు. గతేడాది జులై 14న లష్కర్‌గూడలో జరిగిన కాటమయ్య రక్షణ కవచం పథకం ప్రారంభ సభలో ఎక్స్‌గ్రేషియా విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తే అదే సభలో ఆ రోజే నిధులను విడుదల చేస్తామంటూ ప్రకటించారని పేర్కొన్నారు. ఏడాది గడిచినా ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నిధులను విడుదల చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -