Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాలక్ష్మి సాయం అందేదెప్పుడు.?

మహాలక్ష్మి సాయం అందేదెప్పుడు.?

- Advertisement -

రెండేళ్లు గడిచినా అమలు కాని పథకం
నిరాశలో మహిళలు
నవతెలంగాణ – మల్హర్ రావు

అర్హురాలైన ప్రతి గృహిణికి ప్రతి నెలా రూ.2,500ల చొప్పున ఆర్థికసాయం అందించడానికి మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రకటించారు. హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా పథకం అమలుపై స్పష్టత లేకపోవడంతో ఎంతో మంది మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 9,347 మంది దరఖాస్తులు సమర్పించారు. అధికారంలోకి రాగానే మహిళలకు అండగా ఉండటానికి ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భరోసా ఇచ్చింది. అకారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కోసం సాయం కోరే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ పథకం ద్వారా వితంతు,బీడీల పింఛన్, ఒంటరి మహిళల పింఛన్ ఇలా ఏ భరోసా సాయం అందని వారు ఎంతో మంది మహాలక్ష్మి సాయం ద్వారానైనా లబ్ధి పొందాలని భావించారు.

నిధులు కేటాయించినా..
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మహాలక్ష్మి పథకం కింద ఆరు గ్యారంటీలపై చర్చించి నిధులను కేటాయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం రూ.53,196 కోట్లను కేటాయించినట్లు ప్రభు త్వం వెల్లడించింది. ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మీ సాయం ఒకటి కావడంతో ఈ పథకంపై ఎంతోమంది ఆశతో నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దర ఖాస్తుల స్వీకరణతోనే సరిపెట్టింది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద లబ్ధి పొందేవారి ఎంపిక సాగనేలేదు.దీంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకు న్నాయి. ఆసరా పథకం కింద పింఛన్లను పొందని ఎంతోమందికి మహాలక్ష్మి సాయం కొండంత అండగా ఉంటుందని ఆశించారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో మహిళలు అసహానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహాలక్ష్మి సాయం పథకంను అమలులోకి తీసుకురావాలని పలువురు మహిళలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -