Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీల కొలువులు నింపేది ఎప్పుడు..?

అంగన్వాడీల కొలువులు నింపేది ఎప్పుడు..?

- Advertisement -
  • – జిల్లా లో 795 అంగన్వాడీ పోస్టులు ఖాళీ
    – ఎనిమిది నెలలుగా నిరీక్షణ
    – కొన్ని సెంటర్ల లో టీచర్, ఆయాలు లేక ఇన్ చార్జీలకు అప్పగింత
    నవతెలంగాణ-పెద్దవూర
    అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు ఫిబ్రవరి 8న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో  సభ నిర్వహించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆసభలోనే అంగన్వాడీల కొలువులు విడుదల చేస్తునున్నట్టు తెలిపారు.దీంట్లో తెలంగాణ లో టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదల చేస్తామన్నారు. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో 9 అంగన్వాడీ ప్రాజెక్టు లలో 796 అంగన్వాడీ పోస్టులు భర్తీ కానున్నాయని 08  నెల్లుగా  ఎదురు చూశారు. కాని నిరాశే మిగిలింది.
  • అనుముల ప్రాజెక్టు లో ఆనుముల ఐసీడీ ఎస్ ప్రాజెక్టులో 255 మంది టీచర్ల కు 239 మంది, 255 ఆయాలకు 194 మంది ఉండగా అందులో 16 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 61ఆయా పోస్టులు, బ్లాక్ చింతపల్లి ప్రాజెక్టు లో 25 టీచర్, 66 ఆయాలు, దామరచర్ల ప్రాజెక్టులో 9 టీచర్, 92 ఆయా పోస్టులు, కొండమల్లె పల్లి ప్రాజెక్టు లో 27 టీచర్, 60 ఆయాలు, దేవరకొండ ప్రాజెక్టు లో 33 టీచర్లు, 97 ఆయాలు, మునుగోడు ప్రాజెక్టు లో 08 మంది టీచర్లు, 47 మంది ఆయాలు, మిర్యాలగూడ ప్రాజెక్టు లో 14 మంది టీచర్లు, 58 ఆయాలు, నకిరేకల్ ప్రాజెక్టు లో 9 టీచర్ పోస్టులు, 76 ఆయాలు, నల్గొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు లో 12 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 85 ఆయా పోస్టులు ఖాళీగా వున్నాయి.
  • మొత్తం జిల్లాలో 9 ప్రాజెక్టుల పరిధిలో 2093 మంది అంగన్వాడీ టీచర్ల కు గాను 1949 మంది టీచర్లు ఉండగా మిగిలిన 163 మంది టీచర్ల పోస్టులు, 2093 ఆయాలకు గాను 1451 మంది ఆయాలు ఉండగా మిగిలిన 642 ఆయా పోస్టులు నోటిఫికేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నోటిఫిన్ కేషన్ విడుదల చేస్తున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం జరుపుకోని 8 నెలలు దాటినా ఇంత వరకు అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు.

-పెద్దవూర మండలం లో పెద్దవూర మండలం లో పెదవూర మండల కేంద్రం లో అంగన్వాడీ ఆయా, పెద్దవూర ఎక్స్ రోడ్డులో టీచరు- ఆయా, పోలేపల్లి లో ఆయా, పోతూనూరు బీసీ కాలానిలో టీచరు- ఆయా, తెప్పలమడుగులో టీచరు-ఆయా, శిరసనగండ్ల లో ఆయా, కొత్తలూరు లో టీచరు -ఆయా, గర్నెకుంట లో టీచరు, కుంకుడు చెట్టు తండాలో రెండవ సెంటర్ లో ఆయా, పూల గూడెం మినీ సెంటర్ లో ఆయా, నాగార్జున సాగర్ హిల్ కాలనీలో 01 సెంటర్ లో ఆయా, పులిచర్ల,లో ఆయా, కీరానాయక్ తండాలో టీచర్-ఆయా, జక్కలోనిబావిలో ఆయా,పెద్దవూర మండలం లో అంగన్వాడీ టీచర్ పోస్టులు 05, ఆయా పోస్టులు 12 మొత్తం 17 పోస్టులు ఖాళీగా వున్నాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు లేని కేంద్రాలలో పక్కనే వున్న అంగన్వాడీ టీచర్ కు ఇన్చార్జి అప్పగించారు. పెద్దవూర మండలం లోని తెప్పల మడుగు అంగన్వాడీ కేంద్రం లో ఐదు నెలల క్రితం టీచర్, ఆయా రిటైర్మెంట్ అయ్యారు.

దాంతో పక్కనే వున్న లింగంపల్లి అంగన్వాడీ టీచర్ తెప్పలమడుగు కేంద్రంను ఇంచార్జీగా అప్పగించారు. రెండు కేంద్రాలకు ఒక్కరే ఉండడం తో తెప్పల మదుగు కేంద్రం తాళలకే పరిమితం అయింది. ఇలాంటి కేంద్రాలు జిల్లాలో చాల వున్నాయి. టీచర్ లేని కేంద్రాలలో ఆయాలు, ఆయాలు లేని కేంద్రాలలో టీచర్లు, రెండు లేని కేంద్రాలు తాళాలకే పరిమితం అయ్యాయి. అనుముల ప్రాజెకక్టు పరిధిలో చాలా కేంద్రాలలో ఆయాలు లేరు. టీచర్లు లేరు. దాంతో అయాలు, టీచర్లు లేని కేంద్రాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పక్కనే వున్న అంగన్వాడీ టీచర్లకు ఇన్చార్జి అప్పగించారు. రెండు కేంద్రాలలో విధులు నిర్వహించలేక టీచర్లు అవస్థలుపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖాళీ గా వున్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆయా గ్రామాల ప్రజలు, లబ్దిదారులు కోరుతున్నారు.

ఇది ఇలా ఉండగా గత 4 నెలల క్రితం కుంకుడు చెట్టు తండా అంగన్వాడీ కేంద్రం 02 సెంటర్ లో పనిచేస్తున్న ఆయాను, తూర్పుపూల మినీ సెంటర్ కు ఆయా గా ప్రమోట్ చేశారు. అలాగే మండలం లోని రామన్నగూడెం. ఆంగన్వాడీ టీచర్ ను నిడమానూరు మండలం నర్సిహుమ్మల గూడెం కు టీచర్ గా బదిలీచేసి ఆ సెంటరును తుంగతుర్తి టీచర్ కు ఇంచార్జ్ అప్పగించారు. దాంతో రెండు సెంటర్లు ను ఒక్కరే సూసు కోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన జిల్లా లో ఖాళీగా వున్న అంగన్వాడీ పోస్టులకు నోటిఫికెషన్స్ వేసి భర్తీ చేయాలని ఆయా గ్రామాల ప్రజలు, లబ్దిదారులు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -