Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధితుల వద్దకే పోలీసులు ఎక్కడ ?

బాధితుల వద్దకే పోలీసులు ఎక్కడ ?

- Advertisement -

– ఫిర్యాదు స్వీకరించినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయని ఘటనపై విమర్శలు
నవతెలంగాణ –  కామారెడ్డి

బాధితులు ఎక్కడ ఉన్నా  అక్కడికే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తామని జిల్లా పోలీస్ శాఖ తరచూ ప్రచారం చేస్తోంది. ఇటీవల జిల్లా ఎస్పీ జిల్లా  బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఫోటోలు విడుదలయ్యాయి. అయితే ఆ ప్రచారం వాస్తవానికి పరిమితమైందనే విమర్శలు కామారెడ్డి పట్టణంలో వినిపిస్తున్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో ఓ యువకుడిపై దాడి జరిగినట్లు బాధితుడు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు ఒకటి కంటే ఎక్కువసార్లు విచారణ జరిపి, ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. దాడి జరిగిన విషయాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా మొదటిసారి విచారణలోనే జరిగిన ఘటనను వివరించినట్లు చెబుతున్నారు. అయితే ఫిర్యాదు స్వీకరించినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీనిపై మళ్లీ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా పోలీసులు మరోసారి విచారణ చేపట్టినప్పటికీ కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. దాడి జరిగినట్లు సాక్షులు చెప్పినప్పటికీ కేసు నమోదు చేయకపోవడం ఏమిటనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో పలుకుబడి ఉన్నవారికే న్యాయం జరుగుతుందా ? సాధారణ ప్రజల ఫిర్యాదులు కేవలం విచారణలకే పరిమితమవుతున్నాయా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు న్యాయం కోసం తిరుగుతుండగా, బాధితుల వద్దకే వెళ్లే పోలీసింగ్ కేవలం ఫోటోలకు పరిమితమైందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని, బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -