ఈడీ ఎందుకు చర్యలు తీసుకోదు: సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఏ బేబీ
న్యూఢిల్లీ : భారతదేశంలో పన్ను చెల్లించని ఆర్‌ఎస్‌ఎస్ అమెరికాలో లాబీయింగ్‌కు వేల కోట్లు ఎక్కడివని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ బేబీ ప్రశ్నించారు. ఇటీవలే స్క్వైర్ పాటన్ బోగ్స్ అనే కార్పోరేట్ సంస్థతో ఆర్‌ఎస్‌ఎస్ ఒప్పందం చేసుకుంది. అమెరికా ప్రభుత్వంలో తనకు అనుకూలమైన పనులు చక్కబెట్టడం కోసం 33 వేల డాలర్లతో (దాదాపు 2.75 కోట్లు ) ఈ ఒప్పందం చేసుకుంది. దీనిపై ఎంఏ బేబీ ఎక్స్‌లో స్పందించారు. అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్ లాబీయింగ్ దేనికోసం చేస్తుంది? ఇంత పెద్ద మొత్తంలో నిధులకు మూలాలు ఏంటి ? అని ప్రశ్నించారు. దేశంలోని ప్రతిపక్షాల నాయకులపై తరుచుగా దాడులు చేసే ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అవినీతి నిరోధక శాఖలు ఎందుకు చర్యలు తీసుకోవని నిలదీశారు. అంతేకాకుండా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆర్‌ఎస్‌ఎస్ పని చేసిందని కూడా సంబంధిత పత్రాల్లో పేర్కోంది. అంటే ఆర్‌ఎస్‌ఎస్ అమెరికాలో రిజిస్టర్ అయిందా అని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.. అయితే ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడైన భారత ప్రధాని మోడీ మౌనం వీడాలన్నారు. ఆయన ఎవరికి భయపడుతున్నారంటూ ఎం.ఏ బేబీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు వేల కోట్లు ఎక్కడివి ?
- Advertisement -
- Advertisement -



