నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఎలక్షన్ల మాట రిజర్వేషన్లు ప్రకటించడంతో వేడెక్కుతున్న ఎలక్షన్ల చర్చలు. ప్రతి ఒక్కరి నోట ఎలక్షన్ల మాటే రిజర్వేషన్లు ప్రకటించడంతో గ్రామాల్లోని కొందరు ఏ పార్టీ వారు ఆ పార్టీ గురించి చర్చించుకుంటున్నారు. మన పార్టీ నుండి ఎవరిని పోటీ చే యిస్తే ఎలా ఉంటుందని ఒకరికొకరు చర్చలు జరుగుతున్నాయి. గ్రామంలోని ప్రధాన కూడలిలో, హోటల్. లలో ఎలక్షన్ చర్చలే జరుగుతున్నాయి. జనరల్ స్థానాలలో పోటీకి భారీగా ఎలక్షన్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి .రిజర్వేషన్ల తో పోటీ చేసే వారికి వారు కూడా చాలామంది పోటీకి చేయడానికి సై అంటున్నారు. మండలంలో ఎంపీపీ స్థానం జనరల్ స్థానం కావడంతో భారీగా పోటీ చేయడానికి అందరూ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
జడ్పిటిసి స్థానం మహిళా జనరల్ కావడంతో ఆస్థానానికి కూడా పోటీ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది .జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ కావడంతో దానిపైన కూడా ఎక్కువమంది దృష్టి పెట్టినట్టు సమాచారం. మండలంలో ఎంపీపీ స్థానం కూడా జనరల్ కావడంతో ఎంపీపీ స్థానం కోసం చాలామంది పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో అన్ని పార్టీలైన కాంగ్రెస్ ,టిఆర్ఎస్ బిజెపి టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు చేస్తున్నట్టు సమాచారం. ఎక్కువమంది అధికార పార్టీ అయినా కాంగ్రెస్ నుండి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు పార్టీకి పనిచేసిన కార్యకర్తలు టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. మరికొందరు మాట్లాడుతూ గెలుపు గుర్రాలకి టికెట్లు పార్టీలో పని చేసిన కార్యకర్తలకు లేదా అని ప్రచారం జరుగుతుంది ఇప్పటికైనా పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటివరకు పండగలు బతుకమ్మ దసరా పండగలు జరగడంతో ప్రతి ఒక్కరు ఎలక్షన్ల పైనే వారి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.
ఎక్కడ విన్న ఎలక్షన్ల మాట..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES