Monday, June 30, 2025
E-PAPER
Homeదర్వాజకళ్లల్లోకి నీళ్లు ఎక్కడినుండి వస్తాయో!

కళ్లల్లోకి నీళ్లు ఎక్కడినుండి వస్తాయో!

- Advertisement -

జరిగినవన్నీ జ్ఞాపకానికి వస్తే
కళ్లల్లోంచి టప టపా కన్నీళ్లు రాలుతాయి
మరి కళ్లల్లోకి, ఈ నీళ్లు,
ఎక్కడినుండి వస్తాయో తెలియదు
పక్క పక్కన నడుస్తూనే
గమ్యాన్ని మాయా మహల్‌ చేస్తూ
జీవితం వింత గారడీ చేస్తుంది
ఎన్నిసార్లు అడిగినా
భ్రమలెందుకు చూపుతుందో చెప్పదు
ఇంత చేసినా
జీవితం మీద, నాకు భరోసావుంది
అడుగడుగునా, నా కలలే నాకు –
నీడలవుతాయి, జాడలవుతాయి
ఓదార్పు పొందడానికి
బజార్‌ లో మందులు దొరకవు
దగ్గర కూర్చునే మనిషి కావాలి
ఈ రాత్రి, ఒక తారా లేదు,
యే వాగ్దానం లేదు
అయినా, రేపటి మీది ఆశ అలసిపోలేదు
– ఆశారాజు, 9392302245

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -