కవి సమ్మేళనం
శ్రీశ్రీ జయంతి, మే డే ల సందర్భంగా శ్రామిక కవి సమ్మేళనం ఈ నెల 30 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సభలో కవి యాకూబ్, ఏబూషి నర్సిహ్మ, కె.ఆనందాచారి, తంగిరాల చక్రవర్తి, నస్రీన్‌ఖాన్, సలీమా, శరత్ సుదర్శి, మేరెడ్డి రేఖ పాల్గొంటారు.
‘నాగలి కూడా ఆయుధమే..!’ పరిచయ సభ
దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కొమ్మవరపు విల్సన్ రావు కవితా సంపుటి ”నాగలి కూడా ఆయుధమే” పరిచయ సభ రాపోలు సీతారామరాజు అధ్యక్షతన ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు అంతర్జాల వేదికపై జరుగుతుంది. గుడిపాటి, యం. నారాయణ శర్మ, పి.శ్రీనివాస గౌడ్, గౌతమ్ లింగా, విల్సన్ రావు కొమ్మవరపు పాల్గొంటారు.వివరాలకు : 89854 35515.
గండ్ర హనుమంతరావు స్మారక సాహిత్య పురస్కారానికి ‘షట్చక్రం’ ఎంపిక
గండ్ర హనుమంతరావు స్మారక పురస్కారాన్ని ఈ సంవత్సరం డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి రచించిన షట్చక్రం పుస్తకాన్ని పురస్కార కమిటీ ఎంపిక చేసింది.
జిల్లా సమగ్ర స్వరూప గ్రంథాల కోసం వ్యాసాలు
తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం మొదలైన అంశాలపై తెలంగాణ సారస్వత పరిషత్తు రూపొందించి ప్రచురిస్తున్న జిల్లా సమగ్ర స్వరూప గ్రంథాల పరంపరలో మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాల సంపుటాలకు వ్యాసాలు ఆహ్వానిస్తున్నారు. వివరాలకు : 9441046839
– డా.రాయారావు సూర్యప్రకాశరావు
మాతృ వందనం
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, సితాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మూడవ సంవత్సరం వేడుకలు ఈ నెల 30 ఉదయం 10 గంటలకు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరం లో నిర్వహిస్తున్నారు. 43 మందికి సత్కారం వుంటుంది. ఆచార్య తంగెడ కిషన్ రావు, కవిత దర్యానిరావు, డా|| కె .రజనీ ప్రియ, డా ||మామిడి హరికృష్ణ, భట్టు రమేష్, అయినంపూడి శ్రీలక్ష్మి, నల్లమోతు నాగరాణి పాల్గొంటారు.