Thursday, February 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎక్కడ?

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎక్కడ?

- Advertisement -

అర్హులు 5,79,452 మంది
రెండు జిల్లాల్లో 88 వేలమందికే అమలు
అదీ ఒక్క విడతే ఖాతాల్లో సొమ్ములు జమ
ఆ తర్వాత ముఖం చాటేసిన సర్కారు
సాయంకోసం వ్యవసాయ కూలీల ఎదురుచూపులు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భూమి లేని వ్యవసాయ కూలీల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. 2025 జనవరి 26న సర్కార్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్హు లైన వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని రెండు విడతలుగా వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అప్పట్లో ఉపాధ్యాయ, పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూ పారు. ఎలక్షన్‌కోడ్‌ లేని ఉమ్మడి రంగారెడ్డి, మహ బూబ్‌నగర్‌ జిల్లాల్లో అమలు చేస్తున్నట్టు ప్రకటిం చారు. ఆ రెండు జిల్లాల్లో 83,887 మంది లబ్దిదారు లకు తొలి విడతగా ఒక్కొక్కరి ఖాతాలో రూ.6వేలు చొప్పున రూ.50.33 కోట్లను జమ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయి ఏడాది దాటినా పథకాన్ని రాష్ట్రం మొత్తానికి విస్తరింప చేయలేదు. రెండో విడతగా లబ్దిదారులకు ఇవ్వా ల్సిన మరో రూ.6వేలను కూడా నిలుపుదల చేశారు.

ఉపాధి పనిదినాలకు ముడి
ఆత్మీయ భరోసా లబ్దిదారుల ఎంపికను ఉపాధి హమీ చట్టానికి ముడిపెట్టడంతో భవిష్యత్‌లో వీరి సంఖ్య మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఉపాధి చట్టానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధుల్ని తగ్గించడంతో సహజంగానే లబ్దిదారుల సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నారు. కేంద్రం ఇప్పటికే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును ‘వికసిత్‌ భారత్‌ – గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (గ్రామీణ్‌)’ (వీబీ-జీ రామ్‌జీ) పేరుతో మొత్తం చట్టాన్నే స్కీంగా మార్చేసిన విషయం తెలిసిందే. దీనిప్రకారం కేంద్రం కేటాయించిన నిధుల మేరకే పనుల్ని చేపట్టాలి తప్ప, గ్రామీణ అవసరాల రీత్యా అదనపు పనులు చేయడానికి వీల్లేకుండా నిబంధనల్ని రూపొందించారు.

2005 చట్టం ప్రకారం ఉపాధి హామీ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ యంత్రాలను వినియోగించ కూడదు. కానీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు యంత్రాల వినియోగానికి అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఉపాధి హామీ కూలీల సంఖ్య తగ్గుతుందని చెప్తున్నారు. గతేడాది రాష్ట్రంలో 12.5 కోట్ల పనిదినాలు కల్పించగా, ఈ ఏడాది కేవలం 7.5 కోట్ల పని దినాలు మాత్రమే జరిగాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని దీనికి లింక్‌ పెట్టడంతో పాలనాపరంగా అనేక చిక్కులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.

5,79,452 మంది అర్హులు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 2024- 2025లో దాదాపు 10లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మహత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం డేటాను ఉపయోగించి లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వంద రోజుల్లో కనీసం 20 రోజులు పని పూర్తి చేసిన భూమిలేని కార్మికులు ఈ పథకం ప్రయోజనానికి అర్హులుగా నిర్ధారించారు. ఉపాధి హామీ చట్టంతో పాటు గ్రామసభల్లో సేకరించిన సమాచారం ప్రకారం 5,79,452 అర్హత కలిగిన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం చెప్పినట్టు ఇతర జిల్లాలతో పాటు మొదటి విడత సాయం అందుకున్న రెండు ఉమ్మడి జిల్లాలకు కూడా రెండో విడత నిధులను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. రాష్ట్రంలోని భూమిలేని వ్యవసాయ కూలీలు ఏడాదిగా ఆత్మీయ భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

బడ్జెట్లో నిధులు కేటాయించాలి
రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆత్మీయ భరోసా పథకానికి సరిపడా నిధులు కేటా యించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. పేదల స్కీంల పట్ల గత సర్కార్‌ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లబ్దిదారుల ఎంపికను ఉపాధి స్కీంతో ముడి పెట్టకూడదు. ఎకరం భూమి ఉన్న వారిని సైతం ఈ పథకంలో ఎంపిక చేయాలి. -ఆర్‌. వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -