ఇప్పుడు అయిదు రాష్ట్రాలు శాసనసభల ఎన్నికలకు వెళ్లబోతున్నాయి గనక అందుకు సంబంధించిన విస్తృత దృశ్యాన్ని పరిశీలించవలసి వస్తున్నది. మనకున్న రిపబ్లిక్ రాజ్యాంగ కోణం నుంచి కూడా ఇది అవసరమవుతున్నది. మా పాఠకుల జ్ఞాపకాన్ని మరోసారి మేల్కొల్పవలసిన అవసరం కలుగుతున్నది. ఎందుకంటే హిందూత్వ ప్రేరిత ధ్వనుల మధ్య ఇప్పటికే మనమేదో హిందూ రాష్ట్రంలో ప్రవేశించినట్టే వాతావరణం సృష్టించబడుతున్నది. ఏమైనా ఎన్నికల ప్రజాస్వామ్యం ఇంకా పనిచేస్తూనే వుంది. అలాగే 1950 జనవరి 26న మొదలైన ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థ కూడా అప్పుడున్నంత బలమైన పునాదితోనే వుంది. మనకు ఇష్టమున్నా లేకున్నా ఎన్నికల గురించిన చర్చ రాజ్యాంగంలో రూపొందించుకున్న పరిధిలోనే జరగాల్సి వుంటుంది. ఎన్నికల వ్యవస్థ మొదటి నుంచి కూడా భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటింగు వుండాలని భావించింది. అప్పటికి అనేక యూరోపియన్ దేశాలలో పరిస్థితి అలా వుండేది కాదు కూడా. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం అంటే పార్లమెంటుకైనా, తమ తమ రాష్ట్రాల శాసనసభలకైనా ప్రాథమిక అవసరం అర్హులైన భారతీయులందరూ తమ ఓటుహక్కుతో తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశ ముండాలి.
ఈ విధమైన పద్ధతులలో మొత్తం ఎన్నికల ప్రక్రియకు ఆధ్వర్యం వహించే భారత ఎన్నికల సంఘం నిస్పాక్షికంగా వుండటం అత్యావశ్యకమైన అవసరం. ఈ కారణంగానే రాజ్యాంగం సమాన అవకాశం అని నొక్కి చెబుతోంది. మొదటి ఎన్నికలకు ఆధ్వర్యం వహించిన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్‌పై దృక్పధాన్ని నిజం చేయడానికి రెండు కీలక చర్యలు తీసుకున్నారు. అర్హులైన వారందరిపేర్లు ఓటర్ జాబితాలో వుంచే బాధ్యత ఎన్నికల సంఘంపైనే పెట్టడం తప్ప వ్యక్తిగతంగా ఆ ఓటరుకు వదిలేయలేదు. రెండవది భారత పౌరుడై వుండాలనే మరో అవసరం ఎన్నికల సంఘానికి సంబంధించినంతవరకూ తనిఖీ చేసి నిర్ధారించుకునే పని పెట్టుకోలేదు. ఒకానొక నిర్దిష్ట ఓటరు పౌరసత్వాన్ని మరో పౌరుడు (బహుశా ఇరుగుపొరుగువారెవరైనా) సవాలు చేసిన సందర్భంలో మాత్రమే హోంశాఖ నిర్ధారించవలసి వుంటుందని భావించారు.
అధికారం లేని ‘సర్’
ఇప్పుడు మనం ఈ పరిస్థితిని పూర్తిగా తలకిందులు చేసిన ప్రక్రియ మధ్యలో వున్నాం. రాజ్యాంగం 324, 326, 327 అధికరణాల కింద ఎన్నికల కమిషన్‌కు విస్తారమైన అధికారాలు వున్నాయనే వాస్తవంతో విభేదించడం లేదు గానీ పౌరసత్వ నిర్ధారణ మాత్రం ఎన్నికల సంఘాని(ఈసిఐ)కి అప్పగించబడలేదని చెప్పవలసి వుంటుంది. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగవలసిన తరుణంలో ఈసిఐ తనకు తానే పౌరసత్వ నిర్ధారణ బాధ్యత తీసుకోవడంతో ఈ పరిస్థితి తలకిందులుగా మారడం కనిపిస్తోంది. ఈసిఐకి విస్తార అధికారాలు వున్నప్పటికీ ఈ అధికారం మాత్రం లేదు. ఈ అంశం ఇంకా సుప్రీంకోర్టు విచారణలో వుంది.
అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో అంతిమంగా ఏమంటుందనేది అలా వుంచితే మనం ఇప్పటి వరకూ జరిగిన దాని ప్రభావమేమిటన్నది చూడవచ్చు. 2025 జూన్ 24న బీహార్‌లో మొదలైన ప్రత్యేక ఓటర్ల పరిశీలన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ఓటరు జాబితాలో కొనసాగేలా చూసుకోవలసిన బాధ్యత ఓటరుపైకి బదలాయించింది. గతంలోవలె గాక ఇప్పుడు ఓటర్లు తమ అర్హత కోసం కొన్ని ఫారాలు భర్తీ చేయాల్సి వచ్చింది. 2003 ఎన్నికల జాబితాలో వారు గాని, వారి తలిదండ్రులలో ఎవరో ఒకరు గానీ వుండి వుండాలి. రాజ్యాంగం కల్పించిన ఒక హక్కును కాపాడుకోవడానికి గాను తమ అర్హత నిరూపించుకోవడం ఎంత పెనుసవాలుగా తయారైందో బీహార్‌లో సర్ గురించి సాగిన తీవ్ర చర్చ విధితం చేసింది.
సామూహిక తొలగింపులు
సర్ ప్రక్రియ మొదలైన రోజుకంటే అది ముగిసేనాటికి 65 లక్షల ఓట్లు తొలగించబడటానికి కారణమైంది. ఇది ఒక విడ్డూరమైన తతంగంగా మారింది. సామూహిక తొలగింపులకు సాధనమైంది. కొత్తగా చేర్చిన ఓట్ల సంఖ్య నామమాత్రం కావడంతో తొలగింపులు ఎంత ఎక్కువ సంఖ్యలో సాగాయంటే మొత్తంపైన ఓట్ల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. ఇప్పుడు 12 రాష్ట్రాలలో సర్ తతంగం సాగుతున్నది గనక భారత పౌరుల ఓటింగు హక్కుకు మనం మరింత పెద ఉపద్రవం ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. తొలుత ప్రచురించబడిన ఓటర్ల జాబితాలో తొలగింపుల తర్వాత మిగిలిన సంఖ్య 6.56 కోట్లు. ఈ తొలగింపు చాలా భారీగా జరిగినట్టు లెక్క. సగటున ఇప్పుడున్న ఓట్లలో 13.5 శాతం లేకుండా పోయాయి. ఆసక్తికరమైందేమంటే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2.89 కోట్ల ఓట్లు, తర్వాత స్థానంలోని తమిళనాడులో తొంభై లక్షల ఓట్లు తొలగించబడ్డాయి.
ఈ ప్రక్రియ కూడా యూపీిలో జరిగిన దానికి నకలుగానే తయారైంది. భారీ తొలగింపులు మొక్కుబడిగా అతి తక్కువ చేర్పింపులు. పోల్చి అధ్యయనాలు చేసినపుడు ఈసిఐ లెక్కలు, జనాభా లెక్కలకు పొంతన లేదని తేలింది.యుపీి విషయం తీసుకుంటే గ్రామీణ ప్రాంతంలో మూడు కోట్ల ఓట్ల తేడా వచ్చింది. స్థానిక ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలనలో వెల్లడైన దానితో పోలిస్తే ఈ తేడా తేలింది, ఆ సంఘం కూడా రాజ్యాంగబద్దమైందే మరి.అస్సాంలో పున:పరిశీలన ఫలితాలతో పోలిస్తే ఇక్కడ ఈ భారీఓట్ల హరింపు నమ్మశక్యం కానిదిగా కనిపిస్తుంది. అస్సాంలో జరిగింది సర్ కాదు. అస్సాంలో అసలు తొలగింపులే లేవు. కనుక సార్వత్రిక ఓటింగు హక్కుల కోణం నుంచి చూస్తే ఈ కసరత్తు కేవలం దారుణమైన సామూహిక ఓట్ల తొలగింపుల కోసమే చేపట్టినట్టు స్పష్టమవుతున్నది.
మూడు రకాలుగా వేటు
మామూలుగా చూస్తే ఓటరు జాబితాల సవరణ ఒక నిరంతర ప్రక్రియ. తప్పొప్పులు సవరించి రికార్డుల ప్రకారం కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారివి తొలగించడం జరుగుతుంటుంది. అది సాధారణంగా ఓట్ల చేర్చేదిగా వుంటుందనేది స్పష్టమే. ఓటర్ల సంఖ్య పెరుగుతుంటుందనేది అన్ని చోట్లా ఎన్నికల వ్యవస్థల అనుభవం. ఇంత భారీ ఎత్తున ఓట్లు తగ్గిపోవడం మూడు కారణాల వల్లనే జరగాలి- సామూహిక మరణాలు, సామూహిక వలసలు, సామూహికంగా ఓటింగు హక్కుల తొలగింపులు. సర్ ప్రక్రియ జరిగిన కాలమే తీసుకుంటే.. ఆ తొలగింపుల స్థాయిలో వినాకశకరమైన స్థాయిలో మరణాలు గానీ, దేశం వదలి భారీగా వలసలు పోవడం గానీ జరిగింది లేదు. వాస్తవానికి అంతర్గత వలసలు ఆ స్థాయిలో జరగడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే దానివల్ల మహా అయితే ఓటర్ల బదలాయింపు వుంటుంది గానీ రద్దయిపోవడం ఎలా జరుగుతుంది? కనుక దీన్ని క్రోడీకరించి చెప్పాలంటే ఈ కాలంలో ఈసిఐ ప్రవర్తించిన తీరులో పారదర్శకత ఏ మాత్రం లేకుండా పోయింది.
రాజకీయ పార్టీలూ అలాగే స్వతంత్ర పరిశీలకులు, అలాగే అరుదైపోతున్న స్వతంత్ర మీడియా వేసిన ప్రశ్నలకు అది నోరు బిగించుకు కూచుంది. ఇందుకు ఒక కారణం మాత్రమే కనిపిస్తుంది. సర్ ప్రక్రియనే తీవ్రమైన లోపభూయిష్టంగా వుండటం. దానివల్లనే ఇంతటి ప్రళయం సంభవించింది. సమాన అవకాశాలు అన్న మాటను కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే వర్తించేదిగా ఎవరూ పరిగణించలేరు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఓటరుకూ, వారి రాజ్యాంగ బద్ద హక్కుకు సమాన అవకాశం వుండి వుండాల్సింది. అంత బృహత్తర స్థాయిలో ఈ కసరత్తు చేపడుతున్నప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి వివరణా ఇచ్చిందీ లేదు. ఇక సమ్మిళిత సంప్రదింపుల ప్రక్రియ నిర్వహించడం గురించి అసలు మాట్లాడటానికే లేకపోయింది. అందువల్ల రానున్న ఎన్నికల పోరాటంలో ఈ ప్రశ్న తప్పక ముందుకు తేవలసి వుంటుంది. ఇసిఐ తాను ప్రారంభించిన ప్రక్రియ పారదర్శకత గురించి సాక్ష్యాధార పత్రాలు ఈసిఐ విడుదల చేయడం గానీ, 2002/03 నాడు ఏం జరిగిందో ఆ వివరాలు పంచుకోవడం గానీ జరగనేలేదు.
అయిదు రాష్ట్రాల్లో సవాలే
న్యాయమైన స్వేచ్చాయుత ఎన్నికల కోసం చొరబాటుదారులను ‘గాలింపు, తొలగింపు, తరలింపు’ చేయాలని ఒకసారి హోం మంత్రి ప్రకటించారు. అయితే 12 రాష్ట్రాలకు సంబంధించి ప్రచురించిన ఓటర్ల జాబితాలలో లేక బీహార్ తుది జాబితాలో అలాటి అన్వేషణలో పెద్ద ఫలితాలు వచ్చిన దాఖలాలు చూపే డేటాతో ముందుకొచ్చిందేమీ లేదు. సర్‌ను అత్యుత్సాహంగా నెత్తిన పెట్టుకున్న ఒకే ఒక్క పార్టీ బీజేపీ మాత్రమే గనక దానివల్ల ప్రయోజనం పొందేది కూడా ఆ పార్టీ మాత్రమేనని ఊహించడం సమంజసంగా వుంటుంది. దీనిపై వస్తున్న వార్తా కథనాలను గనక పరిశీలించేట్టయితే బూత్‌ల వారీగా చేర్చాల్సిన పేర్లను ఆరెస్సెస్/ బీజేపీ యంత్రాంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇందుకు సహకరించాల్సిందిగా బూత్ స్థాయి అధికారుల (బూత్ లెవల్ ఆఫీసర్స్-బిఎల్‌వో)పై ఒత్తిడి పెరుగుతున్నది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఉపయోగించే ఎఐ పరికరాలు సాఫ్ట్‌వేర్ సంస్థల వివరాలు పారదర్శకంగా ప్రచురించడం లేదు. ఏమైనా అందిన డేటాను బట్టి చూస్తే మహిళలు, సామాజికంగా కొన్ని తరగతులు ఈ తొలగింపులకు గురవుతున్నట్టు వెల్లడవుతున్నది.ఏమైనా వీటన్నిటినీ బట్టి సామూహిక తొలగింపుల అవకాశం మరింత పెరుగుతున్నది. అందువల్ల ప్రతిపక్షాలకు కీలక ప్రాధాన్యత గల అయిదు రాష్ట్రాలలో ఈ దఫా ఎన్నికలలో సవాలు తీవ్రంగా వుంటుంది. ఎన్నికల బరిలో అందరికీ సమాన అవకాశం కాపాడుకోవడానికి చాలా తీవ్ర పోరాటం జరపాల్సి వుంటుంది. ఈ సవాలును స్వీకరించడానికి మనం సిద్ధం కావాలి.
(జనవరి 14 ‘పీపుల్స్‌డెమోక్రసీ’ సంపాదకీయం)
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోటీలో ‘సమానత’ ఏదీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



