Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాదితునికి ఏ పాజిటివ్ రక్తం అందజేత..

బాదితునికి ఏ పాజిటివ్ రక్తం అందజేత..

- Advertisement -

– హైదరాబాద్ కు వెళ్లి సకాలంలో రక్తాన్ని అందజేయడం అభినందనీయం
– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
నవతెలంగాణ – కామారెడ్డి
: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సువర్ణ (56) గుండె ఆపరేషన్ నిమిత్తమై హైదరాబాద్ లోని ప్రయివేట్ వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అత్యవసరం అయింది. ఈ నేపథ్యంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును వారు సంప్రదించారు. ఆయన సింగరాయపల్లి గ్రామానికి చెందిన అనిల్ సహకారంతో ఏ పాజిటివ్ రక్తాన్ని హైదరాబాద్ కు వెళ్లి అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తల సేమియా వ్యాధి చిన్నారులు,గుండె ఆపరేషన్లు  వివిధ చికిత్సల నిమిత్తమై హైదరాబాద్  ఇతర ప్రాంతాల్లో చికిత్స కోసం వెళ్ళినప్పుడు వారికి కావాల్సిన రక్తం దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సంప్రదించడం జరుగుతుందని, వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం ఎల్లవేళలా ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలిపారు. రక్తదాతల సహకారంతో సకాలంలో రక్తాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా రక్తదానానికి ముందుకు వచ్చిన అనిల్ కు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad