ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో అందరికీ అర్థమవుతోంది.. మరి మనం హెల్దీగా ఉండాలంటే ఏమేం పాటించాలో, ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం…
రెయిన్బో.. : రెయిన్బో ప్లేట్ అంటే ఎక్కువ రంగుల కూరగాయల్ని తినటం. ఎప్పుడూ ఒకే వెరైటీ కాకుండా అన్ని కూరగాయలూ తినడం వల్ల అన్నింట్లో ఉన్న గుణాలూ మనకి చేరతాయి.
ఆహారం పై దృష్టి పెట్టండి : మొబైల్ లో చాట్ చేస్తూనో, టీవీ చూస్తోనో తినడం కాకుండా ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న దాని మీద దృష్టి పెట్టి తినడం వల్ల మంచి లాభాలుంటాయి. అలాగే, నెమ్మదిగా తినడం కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఇంటి భోజనమే ముద్దు.. : వీలున్నంత వరకూ బయట ఫుడ్ తినకుండా ఉండడమే మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో మరీను. వారమంతా ఏం వండాలో ముందే ఒక ఐడియా పెట్టుకుని ఉంటే ప్రాబ్లం ఉండదు.
రొటీన్ డెవలప్ చేసుకోండి : రోజూ ఈ టైంకి బ్రేక్ ఫాస్ట్ అయిపోవాలి, ఈ టైం కి డిన్నర్ ముగించేయాలి అన్న రొటీన్ డెవలప్ చేసుకుంటే ఫుడ్‌కి సంబంధించి మనం చేసే మిస్టేక్స్ తక్కువగా ఉంటాయి. సపోజ్, పని హడావిడిలో ఉండి లంచ్ చేయలేదనుకోండి, సాయంత్రం మూడున్నరా నాలుగింటికి విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడు ఎటూ కాని వేళ లంచ్ చేయాలనిపించదు. ఆఫీసులో ఉంటే కాంటీన్లో సమోసాల మీదకో, ప్రస్తుతం ఉన్న వర్క్ ఫ్రం హోమ్ కండిషన్లో అయితే చిప్స్ పాకెట్ మీదకో మనసు పోతుంది. ఇంకంతే. ఆ పూటకి ఒక రాంగ్ ఫుడ్ ఛాయిస్ జరిగిపోయినట్లే.
కిచెన్ రీ-ఆర్గనైజ్ చేయండి : కుకీలు లాంటివి ఎదురుగా కనిపించేట్లు కాకుండా లోపలగా పెట్టడం, డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్ బౌల్ ఉంచడం వంటివి చిన్న అలవాట్లే కానీ, బాగా మేలు చేసే అలవాట్లు. అలాగే, వారానికి సరిపడా మీల్ ప్లాన్ వేసుకున్న తరువాత కావాల్సిన ఇంగ్రేడియెంట్స్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే ఆ టైమ్ కి హడావిడి పడకుండా ఉంటారు.
నీరు ఎక్కువ తాగండి.. : ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ చాలా మంది పాటించని విషయం. వేసవి కాలమే కాదు వానాకాలం, చలికాలం కూడా నీరు తాగాలి. చలికాలంలో దాహంగా అనిపించక రెండు మూడు గ్లాసుల మించి నీరు తాగని వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పార్టీకి వెళ్ళేప్పుడు : ఫ్రెండ్స్, లేదా రిలేటివ్స్ పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్తాం కదా. అక్కడ మళ్ళీ రాంగ్ ఫుడ్ ఛాయిస్ జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం. మీరు ఏం తినాలనుకున్నారో ఒక ఐడియా తో ఉండడం. వైట్ రైస్ తినను, స్వీట్ తింటాను, డెస్సర్ట్ తినను, రోటీ సబ్జీ తింటాను… ఇలా ఒక ప్లాన్ తో వెళ్తే మీరు పార్టీ ఎంజాయ్ చేసిన వారౌతారు, మీ మీల్ ప్లాన్ కి స్టిక్ అయిన వారూ అవుతారు.
చిన్న ప్లేట్స్ : ప్లేట్స్ చిన్నగా ఉండడం వల్ల మనకి కావలసినంత ఫుడ్ మాత్రమే వడ్డించుకుంటాం. కావాలంటే సెకండ్ సర్వింగ్ తీసుకుంటాం. కానీ, పెద్ద ప్లేట్ లో ఒకేసారి ఎక్కువ పెట్టేసుకుని, ఎక్కువ తినేసి తరువాత అవస్థ పడే కన్నా చిన్న ప్లేట్ లో కొంచెం పెట్టుకుని నెమ్మదిగా నములుతూ, తింటున్న ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
మిగిలిన ఫుడ్ దాచండి : ఇంట్లో వంట చేసినప్పుడు కొంచెం ఎక్కువే చేస్తాం. మరీ కరక్ట్ గా చేయడం ఎవరి వల్లా కాదు. అయితే మిగిలిన ఫుడ్ పారెయ్యటం కంటే ఫ్రిజ్ లో ఇంకో రోజు ఉంచగలిగితే ఇంట్లో ఎవరికైనా టైం కాని టైంలో ఆకలిగా అనిపిస్తే ఇన్స్టంట్ ఫుడ్ బదులు అది తినేయవచ్చు.
ఇవి పాటిస్తూ….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



