గాజా : ఇజ్రాయిల్ సైన్యం దురాగతాలకు అడ్డులేకుండా పోయింది. గతంలో రక్షణ వాహనంపై ఓ పాలస్తీనా యువకు డ్ని బంధించి తీసుకెళ్తున్న ఘటన వెలుగులోకి రాగా..తాజాగా నమాజ్ చేసుకుంటున్న పాలస్తీనా వ్యక్తిపై ఇజ్రాయిల్ సైనికుడు క్రూరత్వం ప్రదర్శించాడు. రోడ్డు పక్కన నమాజ్ చేసుకుంటున్న వ్యక్తిని ఏటీవీ వాహనంతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వివరాల ప్రకారం.. వెస్ట్ బ్యాంక్‌లోని దేర్ జరీర్ గ్రామ సమీపంలో ఒక పాలస్తీనియన్ రోడ్డు పక్కన నమాజ్ చేసుకుంటుండగా సివిల్ డ్రెస్‌లో ఉన్న ఇజ్రాయిల్ సైనికుడు, తన వాహనంతో ఆ వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా.. కిందపడిపోయిన బాధితుడిపై అరుస్తూ, అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఈ దాడిలో బాధితుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
సైనికుడిపై ఇజ్రాయిల్ సైన్యం చర్యలు
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఇజ్రాయిల్ రక్షణ దళం (ఐడీఎఫ్) స్పందించింది. నిందితుడైన సైనికుడు తన అధికార పరిధిని అతిక్రమించి, అత్యంత దారుణంగా ప్రవర్తించాడని పేర్కొంది. వెనువెంటనే అతడిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
నమాజ్ చేస్తుంటే..ఇజ్రాయిల్ సైనికుడి క్రూరత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



