- Advertisement -
హైదరాబాద్ : మ్యూచువల్ ఫండ్స్‌ను అందించే వైట్‌ఓక్ క్యాపిటల్ తన తొలి ఫండ్ వైట్‌ఓక్ క్యాపిటల్ ఫ్లెక్సీ క్యాప్‌ను ఆవిష్కరించి మూడేండ్లయ్యిందని తెలిపింది. ఆగస్టు 2022లో ప్రారంభమైన ఈ ఫండ్ 1.44 లక్షల పెట్టుబడిదారులతో రూ.5,574 కోట్ల ఎయుఎంను చేరుకుందని పేర్కొంది. బిఎస్‌ఇ 500 బెంచ్‌మార్క్‌తో పోలిస్తే ప్రతీ ఏడాది సగటున 19.6 శాతం రాబడిని ఇచ్చిందని పేర్కొంది. ”మా ప్రయాణం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వృద్ధిలో ప్రతిబింబిస్తుంది. మిడ్, లార్జ్ క్యాప్, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లు త్వరలో మూడేండ్ల మైలురాళ్లు చేరుకుంటాయి.’ అని ఆ కంపెనీ సీఈఓ ఆశిష్ సోమైయా పేర్కొన్నారు.
- Advertisement -