Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా యాప్ పై అవగాహన కల్పించిన ఏవో

యూరియా యాప్ పై అవగాహన కల్పించిన ఏవో

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
యూరియా యాప్ పై మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రాజు  రైతులకు, ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్  ను రైతులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పట్టా పాస్బుక్ కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ తో లాగిన్  అయ్యాక యూరియా బుక్చేసుకోవచ్చనీతెలిపారు. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే  సంబంధిత గ్రామ ఏఈవో దగ్గర మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని యూరియా బుక్ చేసుకోవచ్చును. 

ఒకవేళ యాప్ గురించి తెలియక ఫర్టిలైజర్ షాప్ కి యూరియా కోసం వచ్చిన సంబంధిత దుకాణ డీలర్ వారి యొక్క మొబైల్ నుంచి కూడా అప్పటికప్పుడు  రైతులకు యూరియా బుక్ చేసి యూరియా ఇవ్వబడును అని తెలియజేశారు. మండల రైతులు యూరియా కోసం వచ్చే ముందు స్లాట్ బుక్ చేసుకొని ఫర్టిలైజర్ షాప్ కి వెళ్లాలని సూచించారు. ఒకసారి యూరియా బుక్ చేసుకుంటే 24గంటల వరకు బుక్ చేయబడి ఉంటుంది అన్నారు. 24 గంటల తరవాత బుక్ చేసుకున్న యూరియా తీసుకోకపోతే స్లాట్ క్యాన్సల్ అవుతుంది. కాబట్టి మళ్ళీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవగాహన కార్యక్రమంలో  ఏఈవో సౌమ్య , సరోజ , ఫర్టిలైజర్ డీలర్లు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -