Wednesday, February 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలునా ఓటు ఏవరేశారో..

నా ఓటు ఏవరేశారో..

- Advertisement -

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : మున్సిపాలిటీ ఎన్నికల్లో తన ఓటు ను వేరేవాళ్లు వేశారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడలోని 15వ వార్డులో ఓటు వేసేందుకు వెళ్లిన క్యామ పారిజాతకు చేదు అనుభవం ఎదురైంది. ఓటేసి తమకు కావాల్సిన నేతను ఎన్నుకునేందుకు గ్రామంలోని పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి క్యూలో నిలబడింది. తీరా తన వొంతు రాగానే ఓటు వేసేందుకు పేరు వివరాలు తెలుపగా.. ఆ ఓటు అప్పటికే పోల్ అయినట్లు అధికారులు చెప్పడంతో సదరు మహిళా ఓటరు  ఒక్కసారిగా అవాక్కయ్యింది. తాను ఓటు వేసేందుకు ఇప్పుడే వచ్చానని తెలుపగా మరోసారి పరిశీలించి ఓటు ఇప్పటికే వేశారని అధికారులు చెప్పారు. దీంతో చేసేదేమిలేక అక్కడి నుండి వెనుదిరిగింది. తన ఓటు వేరే వాళ్ళు వేశారని ఆవేదనతో ఆందోళన చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -