స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం మేరకు బీసీలకు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఈ రిజర్వే షన్లను తేవాల్సి ఉంది. ఈ మేరకు మూడు నెలల కిందటే శాసనసభ, మండలిలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం ఆమోదించుకుంది. గవర్నర్ అనుమతితో అదే బిల్లును కేంద్రానికి పంపింది. సెప్టెంబరు 30కల్లా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి, ఫలితాలు ప్రకటించాలంటూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సర్కారులో కదలిక పెరిగింది.
రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలు, 5982 ఎంపీసీలు, 585 జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఎన్నికలు నిర్వహిం చాల్సి ఉంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇబ్బందులు న్నాయి. భౌగోళిక, సామాజిక, ఆర్థిక సమస్యలు, రాజకీయ వెనుకబాటు, కులగణన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. అసాధారణ సందర్భాల్లో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టసవరణకు ఆర్డినెన్స్ తేవాలని సర్కారు నిర్ణయించింది. దీనికీ రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్‌సిగల్ ఇచ్చింది. అడ్డంకులను తొలగించడానికి ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సహకరించుకోవాల్సి ఉంది. గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంతో వచ్చే అరకొర నిధులకు కేంద్రం మోకాలడ్డుతున్నది. ఇప్పటికే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల నిధులకు కోతలు పెడుతున్నది. పాలకవర్గాలు లేవనే సాకుతో గ్రామాలను ఎండబెడుతున్నది. ఎలాంటి న్యాయపరమైన లోపాలు తలెత్తకుండా చట్టపరంగా రిజర్వేషన్లను కల్పించడం ద్వారా పంచాయతీలను పరిపుష్టం చేయాల్సిన అవసరముంది.
అణగారిన వర్గాలు, సామాజిక తరగతుల పట్ల వివక్ష చూపించే బీజేపీకి, బీసీలకు రిజర్వేషన్లను కల్పించడం ఇష్టం లేనట్టుగా ఆపార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతున్నది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లల్లో ముస్లింలకు పది శాతం కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కేంద్రమంత్రి బండి సంజరు మాట్లాడారు. అలాగే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చడం కుదరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు ఢిల్లీలో మీడియాతో వాఖ్యానించారు. అసలు ఈ మాటలు రాష్ట్ర బీజేపీ అంటున్నదా? లేక కేంద్రం ఆలోచనలు వీళ్లు బయటపెడుతున్నారా? అనేది ఇప్పుడు ప్రజలకు మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు ఇప్పటికే అమలవుతున్నాయి. తమిళనాడులోనూ అమలు చేస్తున్నారు. మరి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుకు ఎందుకు అడ్డు పడుతున్నారో సమాధానం చెపాల్సిన అవసరముంది. ఇది బీజేపీ రెండు నాల్కల ధోరణిని నిదర్శనంగా కనిపిస్తున్నది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా జనాభా బీసీలదే. వారికి రాజకీయ ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర సర్కారు రాజీపడకూడదు. కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా బిల్లును ఆమోదింపచేసుకోవాలి. తద్వారా వారి రాజకీయ వెనుకబాటును దూరం చేయగలగాలి.
రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన కేవలం సమాచారం మాత్రమే కాదనీ, తెలంగాణకు నిర్వహించిన మెగా హెల్త్‌చెకప్ అని సీఎం రేవంత్ ప్రకటించారు. బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలుచేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చి, ఇప్పుడు పార్లమెంటులో ఆమోదానికి పెట్టడానికి, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి బీజేపీ వెనుకాడుతున్నది. కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నా. రిజర్వేషన్ల బిల్లుపట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవ హరిస్తుండటం గర్హనీయం. కేంద్రం కోర్టులోనే బీసీ రిజర్వేషన్ల బాల్ ఉన్నది. న్యాయపరమైన సమస్యలు తలెత్త కుండా ఆర్డినెన్స్ తేవాలని రాజకీయపార్టీలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రేవంత్ సర్కారు కేంద్రంపై ఒత్తిడి చేసి మరీ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం కలి గేలా గట్టి చర్యలు చేపట్టాలి. అప్పుడే బీసీలకు సామాజిక, రాజకీయ న్యాయం జరుగుతుంది.
రిజర్వేషన్లకు అడ్డెవరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES