– వెనిజులాలోని ముఖ్య అధికారులపై ట్రంప్ దృష్టి
– ఆ దేశ ఇంటీరియర్ మినిస్టర్ డియోస్టాడో కాబెల్లోకు అమెరికా హుకూం
కారకాస్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అనంతరం అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఆ దేశంలోని ఇతర ముఖ్య అధికారులపై ట్రంప్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దేశ ఇంటీరియర్ మిని స్టర్ డియోస్డాడో కాబెల్లోకు అమెరికా హుకుం జారీ చేసినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. వెనిజులా భద్రతా దళాలు డియోస్డాడో నియంత్రణలోనే ఉండడంతో తమకు పూర్తిగా సహకరించాలని.. లేదంటే మదురోకు పట్టిన గతే పడుతుందని ట్రంప్ ఆయనను హెచ్చరించినట్టు తెలిపాయి. వెనిజులా నేతలు తమ మాట వినకపోతే డియోస్డాడోను తదుపరి లక్ష్యంగా చేసు కోవాలని అగ్రరాజ్యం భావిస్తున్నట్టు పేర్కొ న్నాయి. కాగా అతడు భద్రతా దళాల అధ్యక్షు డిగా ఉన్న నేపథ్యంలో వాటిపైనా అమెరికా మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేస్తోంది. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికా చెప్పిన పనులు చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు అమెరికా పేర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంటీరియర్ మినిస్టర్ డియోస్డాడోతో ఆమెకు విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. దీంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలనే విషయం పై దష్టిపెట్టినట్టు తెలుస్తోంది. వెని జులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినోపై కూడా అమెరికా నిఘా పెట్టినట్టు అంతర్జా తీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
మదురో ఆపరేషన్‌లో 56 మంది భద్రతాధికారులు మృతి
వెనిజులా అధ్యక్షడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో అమెరికా చేపట్టిన ఆకస్మిక దాడుల్లో 56 మంది భద్రతాధికారులు మరణించారు. వెనిజులాకు చెందిన 24 మంది చనిపోయారని అక్కడి ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో పాటు వెనిజులాలో పనిచేస్తున్న 32 మంది క్యూబా సైనిక, పోలీసు అధికారులు సైతం ఈ ఆపరేషన్‌లో మరణించారని క్యూబా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మరోవైపు డజన్లకొద్దీ భద్రతా సిబ్బంది, పౌరులు కూడా మరణించారని వెనిజులా అటార్నీ జనరల్ తారెక్ విలియం తెలిపారు. యుద్ధ నేరం కింద కేసులు నమోదు చేసి విచారిస్తామని ఆయన ప్రకటించారు.అటు క్యూబా ఆర్మీలో మరణించిన వారు 32 మంది ఉంటారని చెప్పింది. అలాగే మరణించిన వారిలో కల్నల్స్, లెఫ్టినెంట్లు, మేజర్లు, ౖప్టెన్లతోపాటు కొంతమంది రిజర్వ్ సైనికులు ఉన్నారని క్యూబా తెలిపింది. వీరంతా రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను క్యూబా ప్రభుత్వం వివరించింది. అయితే, వెని జులాలో ఏ మిషన్లో భాగంగా పనిచేస్తున్నారన్న విషయాన్ని మాత్రం క్యూబా ప్రభుత్వం వివరించలేదు. అయితే వెనిజులా, క్యూబా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కొంత ఆర్మీ ఆ దేశంలో ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. కాగా అమెరికా దాడిలో మతి చెందిన సైనికుల కోసం వెనిజులా వారం రోజులు సంతాప దినాలు ప్రకటించింది.
అమెరికా పెత్తనాన్ని తిరస్కరిస్తున్నాం : డెల్సీ రోడ్రిగ్జ్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ మదురోను అమెరికా నిర్బంధించడాన్ని వ్యతిరేకించారు. మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్‌ను అపహరించి తమ ప్రజాస్వామ్యంపై, దేశ సార్వభౌమత్వంపై యూఎస్ దాడి చేసిందన్నారు. తమ దేశంపై అగ్రరాజ్యం పెత్తనాన్ని తిరస్కరిస్తున్నట్టు తెలిపారు.
అమెరికా నెక్ట్స్ టార్గెట్ ఎవరు ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



