- Advertisement -
కాళోజీ ప్రతిమాట తేట మనసు ఊట
పదాడంబరమెరుగని సాదా కావ్యపు తోట
కాళోజీ ఎవరంటే
కాలంపై సంతకం
కాళోజీ ఎక్కడంటె
మనిషి ఎక్కడుంటె అక్కడే!
కాళోజీ పక్కా మనిషి
మనిషికి నిర్వచనమైన మహామనీషి
ఎత్తులు వంతులు తెలియని ప్రేమధార కాళోజీ
పరుల కొరకు ప్రవహించే జీవధార కాళోజీ
(సెప్టెంబరు 9 కాళోజీ జయంతి సందర్భంగా..)
- మడిపల్లి దక్షిణామూర్తి,
98662 77107
- Advertisement -