Saturday, February 21, 2026
E-PAPER
Homeమానవిపిల్లల బాధ్యత ఎవరిది?

పిల్లల బాధ్యత ఎవరిది?

- Advertisement -

భార్యా భర్త ఇద్దరూ కలిసి జీవించినంత కాలం పిల్లల బాధ్యత తల్లిదండ్రులిద్దరికీ ఉంటుంది. కానీ పరిస్థితులు అనుకూలించకపోయినా, భర్త వేరే సంబంధాలు పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోకపోయినా, వదిలేసి వెళ్లిపోయినా, విడాకులు తీసుకున్నా పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లిపైనే ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా తల్లి తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాంటి కథనం గురించే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌)లో తెలుసుకుందాం…

శృతికి దాదాపు 36 ఏండ్లు ఉంటాయి. ఆమెకు మనీష్‌తో పెండ్లి జరిగి 20 ఏండ్లు అవుతుంది. ముగ్గురు పిల్లలున్నారు. బాబు పదో తరగతి, ఒక పాప ఎనిమిది, మరో పాప ఆరో తరగతి చదువుతున్నారు. శృతి ప్రభుత్వ ఆఫీసులో కాంట్రాక్ట్‌ ‘మీ అమ్మ నా ఇంట్లో ఎందుకు ఉండాలి’ అని గొడవ పెట్టుకునేవాడు. దాంతో ఆమె రాకుండా ఆగిపోయింది. మనీష్‌ ప్రవర్తనపై గతంలో నాలుగైదు సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. కానీ అతనిలో ఎలాంటి మార్పూ లేదు.

ఇక మనీష్‌ వాళ్ల అమ్మను పిలిపించి ‘అత్తమ్మ.. మనీష్‌ ఎలాగో ఉద్యోగానికి సరిగ్గా వెళ్లడం లేదు. నేను ఉద్యోగానికి వెళుతుంటే పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నాను. పిల్లలు ఏమైపోతారో అని భయంగా ఉంది. మీ అబ్బాయి ఉద్యోగం చేయకపోయినా పర్లేదు. కనీసం పిల్లలను అయినా చూసుకుంటే బాగుంటుంది. కానీ ఆయన చెప్పాపెట్టకుండా వారం పది రోజులు ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోతున్నాడు. నేను అడిగితే ‘నా ఇష్టం నేను ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాను. నువ్వెవరు నన్ను అడగటానికి’ అంటున్నాడు. మీరైనా పిల్లల్ని చూసుకుంటే నేను ఉద్యోగం చేసుకుంటాను’ అంది. అప్పటి నుండి ఆమె పిల్లల్ని చూసుకుంటుంటే శృతి ఉద్యోగానికి వెళుతుంది.

శృతి ఉద్యోగం షిప్టులుగా ఉంటుంది. రాత్రి షిఫ్టుల్లో వెళ్లడం, రావడం ఇబ్బందిగా ఉండేది. దాంతో వాళ్ల ఆఫీసుకు దగ్గరలో ఇల్లు తీసుకున్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. శృతి ఉదయాన్నే లేచి వంట చేసి ఆఫీసుకు వెళ్లేది. వచ్చిన తర్వాత మిగతా పని చేసుకునేది. మనీష్‌ మాత్రం ఇంట్లో సరిగ్గా ఉండేవాడు కాదు. పైగా శృతికి ఎవరితోనే సంబంధం ఉందని అనుమానించి కొట్టేవాడు. ఇలా చాలా సార్లు జరిగింది. తల్లి కూడా అతన్ని చాలా సార్లు తిట్టింది. దాంతో తల్లిని కూడా ఇంట్లో నుండి గెంటేశాడు. శృతినే బతిమలాడుకొని ఆమెను తిరిగి పిలిపించుకుంది. ప్రస్తుతం చిన్న బాబు ఐదో తరగతి చదువుతున్నాడు. పిల్లలు భయపడి ‘నాన్న మనకు వద్దు’ అంటూ ఏడుస్తున్నారు. మనీష్‌ ఏమో ఒక ట్రాన్స్‌ జెండర్‌తో కలిసి వేరే ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సహాయం కోసం ఐద్వా లీగల్‌ సెల్‌కు వచ్చింది.

మేము మనీష్‌ను వాళ్ల అమ్మను పిలిచి మాట్లాడితే ‘నేను తప్పు చేశాను. నా కొడుక్కు ఇచ్చి పెండ్లి చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాను. అందుకే నేను ఆమెకే సపోర్ట్‌ చేస్తున్నాను. మనీష్‌ బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. నేను శృతితో ఉండి పిల్లల్ని చూసుకుంటాను. మనీష్‌ గురించి అయితే నాకు తెలియదు. అతను మారతాడనే నమ్మకం కూడా నాకు లేదు. మీరే ఏదో ఒకటి చేయండి. ఎంతైనా తల్లిని కదా.. నా కొడుకూ కోడలు సంతోషంగా ఉండాలనే ఉంది’ అన్నది. మనీష్‌ మాట్లాడుతూ శృతి వేరే వాళ్లతో సంబంధం పెట్టుకుంది. అందుకే నేను వాళ్లందరినీ వదిలి పెట్టి వెళ్లిపోయాను. ఆమె నన్ను కనీసం ఓ మనిషిగా కూడా చూడడం లేదు. చివరకు పిల్లలు కూడా నన్ను తిడుతున్నారు. అలాంటి ఇంట్లో నేను ఎలా ఉంటాను? ఇక నేను ఆమెతో కలిసి ఉండలేను’ అన్నాడు.

శృతి మాట్లాడుతూ ‘నాకు వేరే వాళ్లతో సంబంధం ఉంటే భర్త కావాలని, అతనిలో మార్పు రావాలని ఎందుకు వస్తాను? అత్తమ్మ నా దగ్గర దాదాపు పదేండ్ల నుండి ఉంటుంది. ఆమెకు నేనేంటో తెలుసు. కాబట్టే నాకు సపోర్ట్‌ చేస్తుంది. కుటుంబాన్ని చూసుకోవడం చేతగాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నన్నే తప్పు పడుతున్నాడు. ఈయన నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కేవలం పిల్లలకు తండ్రి కావాలనే ఉద్దేశంతోనే సర్దుకుపోతున్నాను. ఇక అతనితో నేను కలిసి ఉండలేను. ఇప్పుడూ ఆయన మా కోసం చేస్తుంది ఏమీ లేదు. ఏదో చుట్టం చూపుగా వచ్చిపోతున్నాడు. ఇక ఇప్పుడు అది కూడా అవసరం లేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

మధ్యలో మనీష్‌ తల్లి కల్పించుకొని ‘అయితే నా పేరుతో ఉన్న పొలాన్ని శృతి, పిల్లల పేరుపై రాస్తాను’ అంది. దానికి మనీష్‌ ఒప్పుకోలేదు. ‘భార్యా పిల్లలతో ఉండకుండా నీ ఇష్టం వచ్చిన దగ్గర నువ్వు ఉంటే నీకెందుకు రాస్తాను’ అంది. మూమే కల్పించుకుని ‘చూడు మనీష్‌.. నువ్వు భార్యా పిల్లలతో కలిసి ఉండనంటున్నావు. ఇక నీకు ఆస్తి ఎలా వస్తుంది? శృతి కష్టపడి పిల్లల్ని పోషించుకుంటుంది. నువ్వు పట్టించుకోకపోతే ముగ్గురు పిల్లల్ని చూసుకోవల్సిన బాధ్యత ఆమెదే కదా. నీకెలా నీకు నచ్చినట్టు జీవించే హక్కు ఉందో, అలాగే శృతికి కూడా ఉంటుంది. శృతికి అండగా మీ అమ్మ, పిల్లలు ఉన్నారు. నీకే ఎవ్వరూ లేరు. రేపు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో’ అన్నాము. శృతితో ‘నీ భర్త మారకుండా ఇలాగే ప్రవర్తిస్తే నీ నిర్ణయం నవ్వు తీసుకో. నీకు మీ అత్తమ్మ తోడు ఉంది. అలాగే మేము కూడా కావల్సిన సహకారం అందిస్తాము’ అని ధైర్యం చెప్పి పంపించాము.

వై వరలక్ష్మి,
9948794051.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -