నవతెలంగాణ-హైదరాబాద్: ఏప‌్రీల్ 22న జరిగిన పహల్గాం మారణోమానికి బాధ్యలెవరని పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఈ పాశవికచర్యలో అమాయకమైనా 26మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయరని, మతంపేరుతో వ్యక్తులపై కాల్పులు జరపడం దారుణమైన సంఘటన అని జమ్మూలోని మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది నిఘా వైఫల్యమైతే, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 26 మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం లేదు, భద్రత, నిఘాలో వైఫల్యం జరిగిందని ఇప్పుడు మనకు తెలుసు, ఎవరైనా బాధ్యత వహించాలి” అని సీఎం ఒమర్ అన్నారు. ఈ ఘోరమైన దాడికి జవాబుదారీతనం నిర్ణయించాలని పిలుపునిచ్చారు.
జమ్మూ కాశ్మీర్ ఒక పరివర్తనను చూస్తోందని, “ఉగ్రవాదం ఇక్కడ నిలబడదు” అనే వాస్తవానికి ఇది ఒక ఉదాహరణ అని జూలై 10న, ఎల్జీ మనోజ్ సిన్హా అన్నారు. కానీ గత యాభై ఏళ్లలో కూడా అలాంటి మార్పు ఎప్పుడూ జరగలేదని ప్రజలు అంటున్నారని సీఎం అన్నారు.