Thursday, May 22, 2025
Homeసినిమా'వీరరాజు' ఎవరు?

‘వీరరాజు’ ఎవరు?

- Advertisement -

రాయల్‌ స్టార్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో కిరణ్‌ చెరుకూరి నిర్మాతగా, రుద్ర వీరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరరాజు 1991′. రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (గురువారం) రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సహ నిర్మాత శివాన్వితరావు మాట్లాడుతూ,’ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘సినిమా అందరికి నచ్చుతుంది. సినిమాను ఆదరించాలని ఆశిస్తున్నాను’ అని నిర్మాత కిరణ్మరు చెరుకూరి చెప్పారు. హీరో రుద్రవీరాజ్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాను సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి ముఖ్య కారణం హరిచరణ్‌. చాలా సపోర్ట్‌ చేశారు. ఇందులో కష్ణ కాంత్‌ ఒక పాట రాశారు. రాంబాబు గోసాల రెండు పాటలు రాశారు. బెనర్జీ, అజరు గోష్‌ పాత్రలు అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తాయి. ఈ సినిమాలో చేసిన పాత్రకు మంచి స్పందన లభిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. అర్చన, రాహుల్‌, గోపారాజ్‌, కిషోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ-స్క్రీన్‌ ప్లే-డైరెక్షన్‌: రుద్రవీరాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: శివాన్వితరావు, సౌమ్య నటరాజ్‌, డిఓపి: హరిచరణ్‌ కె, ఎడిటర్‌: కెఎం ప్రకాష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: గగన్‌ బడేరియా, ఆర్ట్‌ డైరెక్టర్‌: అమర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -