- Advertisement -
రోడ్డు ప్రమాదాల్లో
నేరం ఒకరిది
శిక్ష మరొకరిది
ఎవరికివారే
కావేరీ తీరు ఇది
తల్లి అంటే గర్భంలో
పిండాన్ని ధరించేది.
బస్ డ్రైవర్ అంటే
అంతకు మించి!!
కడుపులో వ్యక్తుల్ని
మోసేవాడు అని
డ్రైవర్ ఎప్పుడు అనుకుంటాడో.
కఫిన్ బాక్స్ లోకి
శవాల్ని ఎక్కిస్తారు
ఇక్కడ బస్సులోంచి
అస్తిపంజరాలు దిగుతాయి
నెపాల్ని, పాపాల్ని నెట్టేసుకుంటూ
ముందుకు సాగడమే
ఇప్పటి’ ప్రయాణం’!
చెకింగులు, షాకింగులు
తాత్కాలమేలే
బస్సుల చెడుగుడు
హై’ వే’ల్లో మామూలే!!
- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,
8008 577 834
- Advertisement -



