Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పసర పంచాయితీలో పాగా వేసేది ఎవరు?

పసర పంచాయితీలో పాగా వేసేది ఎవరు?

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
వ్యూహరచనలో పలు రాజకీయ పార్టీలు  పొత్తులపై దృష్టి సారిస్తున్న నేతలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన పసర సర్పంచ్ మండలంలోని అతిపెద్ద గ్రామపంచాయతీ పసర. డిసెంబర్ లేదా జనవరి మాసంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారన్న  ప్రభుత్వ మరియు మంత్రుల ప్రకటనలతో ఆసక్తికరంగా మారిన స్థానం ఇది. మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా  అన్ని గ్రామ పంచాయతీలలో కెళ్ళ అతిపెద్ద గ్రామపంచాయతీ ఆదాయం అధికంగా ఉన్న పంచాయతీ కూడా పసర నగరం కావడం విశేషం. గత పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయములు సర్పంచి ఎన్నికలలో ఇక్కడ పరాజయం పాలయింది. గత పది సంవత్సరాలలో మొదటి ఐదు సంవత్సరాలు సీపీఐ(ఎం) ద్వితీయ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలు సర్పంచి స్థానాన్ని కైవసం చేసుకుని పరిపాలన సాగించారు.

గతంలో కోల్పోయిన సర్పంచ్ స్థానాన్ని ఈసారి ఎలాగైనా నిలుపుకోవాలని తాపత్రయంతో సీపీఐ(ఎం) ముంబారంగా పావులు కదుపుతోంది. ఆ పార్టీ నూతన జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ పార్టీకి నూతన జీవసత్వాలను సంతరింపజేస్తూ యువతను పార్టీలోకి విశేషంగా ఆకర్షిస్తూ ఆహ్వానిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అందరికంటే ముందుగా గత ఎన్నికల్లో ఓటమిపాలైన గొంది రాజేష్ ని సర్పంచ్ అభ్యర్థిగా ఈసారి కూడా నిలుపుతూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ ధర్నాలు రాస్తారోకోల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు.

నివాస గృహాల సమస్య కొరకు గత మూడు సంవత్సరాలుగా గుడిసె పోరాటాలు నిర్వహిస్తూ 10 ఎకరాల పరిధిలో సుమారు 400 మంది కుటుంబాలు గుడిసెలు వేసుకుని చేస్తున్న పోరాటం ఈ సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం పార్టీకి కలిసి వచ్చే అవకాశం గా చెప్పవచ్చు, సర్పంచి గెలుపు కోసం ఇప్పటికే అనేక రకాల సామవేద దండోపాయాలతో సీపీఐ(ఎం) ముందుకు సాగుతోంది. గత సర్పంచ్ ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికిని తర్వాత జరిగిన ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు మొదలుకొని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పసర గ్రామపంచాయతీ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ ఓటింగ్ లో ఆధిక్యతను చాటుకుంది. ఇదే పరంపరలో సర్పంచి స్థానాన్ని కూడా చేజెక్కించుకోవాలని టిఆర్ఎస్ వర్గాలు వువ్విల్లు ఊరుతున్నారు. అవసరమైతే కలిసి వచ్చే పార్టీలతో స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పొత్తులకు కూడా సిద్ధమని ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారని  ఆ పార్టీ  రాజకీయ నాయకులు కొందరు తెలుపుతున్నారు.

గత కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ప్రజలు ఆ పార్టీ పరువును పూర్తిగా తీసివేసింది. సర్పంచి ఉప సర్పంచ్ కుర్చీల తన్నులాట మొదలుకొని బాధితుల విజ్ఞప్తి మేరకు సర్పంచిని పార్టీ నుండి బహిష్కరించే విధంగా పరిస్థితులు దారి తీశాయి. ఈ కాలంలో ప్రజలు పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావు చివరకు కొందరు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తమ గోడును వెల్లబోసుకున్నారు. చివరకు స్పందించిన ఎమ్మెల్యే సదరు వ్యక్తిని బహిష్కరించి ఇకపై ఎలాంటి ఒత్తిడిలు ఉండవని హామీ ఇచ్చారనీ పలువురు బాధితులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంత సానుకూల వాతావరణం ఇక్కడ కనిపించడం లేదు. ఎలాగైనా సర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవాలని బి ఆర్ ఎస్ తోపాటు మరో జాతీయ పార్టీ పొత్తు పెట్టుకునేందుకు కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా కోర్టు తీర్పు వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -