Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంది రైతులకు న్యాయం చేసేదెవరు?

కంది రైతులకు న్యాయం చేసేదెవరు?

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల పరిధిలోని కంది రైతులు పంట పండించి, కొనుగోళ్ళు చేసుకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు ఆశగా వచ్చినకాడికి రైతుల నుంచి దండుకోవచ్చని ఎదురుచూస్తున్నారు. కాని కనీస మద్ధతు ధర రైతులకు కల్పిస్తామన్న ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్టు వ్యవహరించడం భావ్యం కాదని, తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు.

పెద్దయుడికి గ్రామానికి చెందిన నగ్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ మండలంలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం కంది పంట మండలంలో సుమారుగా 7వేల ఎకరాలలో పండిస్తున్నారు. ఎకరాకు ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల  దిగుబడి వచ్చే ఆవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మండలంలో కంది పంట కోత దశకు చేరుకుంటుంది. అక్కడక్కడ కంది పంటను కోత కోసి ఇంటికి తీసుకొచ్చిన కొంతమంది రైతులు గిట్టుబాటు ధర లేక దళారులకు అమ్మ కోవడం జరుగుతుంది.

వీటికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ నేటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడం రైతులకు ఒకింత వడ్డీ భారం పెరుగుతో వస్తుందని రైతులు అంటున్నారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ గత సంవత్సర కాలంగా మండలానికి చేసింది ఏమీ లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ చైర్మన్ జుక్కల్ మండల కేంద్రంలో కంది కనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -