Friday, December 12, 2025
E-PAPER
Homeఆటలుఫైనల్‌కు చేరేదెవరో?

ఫైనల్‌కు చేరేదెవరో?

- Advertisement -

– నేటి నుంచి ముస్తాక్‌ అలీ సూపర్‌ పోరు
పుణె :
దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌అలీ ఫైనల్‌ రేసు నేటి నుంచి ఆరంభం. గ్రూప్‌ దశ మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 8 జట్లు నేటి నుంచి సూపర్‌ లీగ్‌ దశలో పోటీపడనున్నాయి. ముంబయి, రాజస్తాన్‌, హర్యానాలతో హైదరాబాద్‌ గ్రూప్‌-బిలో ఉంది. మధ్యప్రదేశ్‌, జార్ఖండ, ఆంధ్ర, పంజాబ్‌లు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. సూపర్‌లీగ్‌ దశలో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. నేడు పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగే సూపర్‌లీగ్‌ తొలి మ్యాచ్‌లో ముంబయితో హైదరాబాద్‌ తలపడనుంది. తిలక్‌ వర్మ అందుబాటులో లేకపోయినా.. మహ్మద్‌ సిరాజ్‌ రాకతో హైదరాబాద్‌ ఫైనల్లో బెర్త్‌ కోసం పోటీపడనుంది. మరో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -