పోటీలో అదానీ, టాటా, ఎల్ అండ్ టీ, హాల్
న్యూఢిల్లీ : ఐదో తరానికి చెందిన యుద్ధ విమానాలను తయారు చేసేందుకు ఏడు భార తీయ కంపెనీలు రక్షణ మంత్రిత్వ శాఖకు బిడ్లు సమర్పించాయి. అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ తరహా యుద్ధ విమానాలను దేశీ యంగానే తయారు చేసుకుం టున్నాయి. వాటి సరసన చేరాలని నిర్ణయించుకున్న రక్షణ శాఖ దేశీయ కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానిం చింది. అత్యాధునిక మధ్య శ్రేణి యుద్ధ విమానాల (ఏఎంసీఏ) తయారీకి ప్రముఖ సంస్థలైన ఎల్ అండ్ టీ, హాల్, అదానీ డిఫెన్స్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, కల్యాణ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ ముందుకు వచ్చాయి. 2030వ దశకం మధ్య నాటికి ఈ విమానాలు రక్షణ శాఖకు అందుతాయి. డీఆర్‌డీఓకు చెందిన మాజీ క్షిపణి శాస్త్రవేత్త ఎ.శివతను పిళ్లై నేతృత్వం లోని కమిటీ బిడ్లను విశ్లేషిస్తుంది.
సిఫార్సులను అంద జేయడానికి ముందు ఈ కమిటీ సాంకేతిక, వాణిజ్య వివరాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. ప్రొటోటైప్ అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్ పది హేను వేల కోట్ల రూపా యలు. తుది ఆర్డర్ అనేక లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. బిడ్లు దాఖలు చేసిన కంపెనీలు ఎఎంసీఏ డిజైన్‌ను అర్థం చేసుకోవడంలో తమ అనుభవాన్ని, సాంకేతిక నైపు ణ్యాన్ని చూపించాల్సి ఉంటుంది. అభివృద్ధి, ఇంజినీరింగ్, తయారీ, ఇంటి గ్రేటింగ్ ఎక్విప్‌మెంట్, టెస్టింగ్‌లో కూడా ఆ కంపెనీలకు విధిగా అనుభవం ఉండాలి. నూతన యుద్ధ విమానాలు అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉంటాయి. ముందుగా నాలుగైదు ప్రొటోటైప్ విమానాలను తయారు చేసుకొని, ఆ తర్వాత ఉత్పత్తిని చేపడతారు. అనంతరం వాటిని పూర్తి స్థాయిలో పరీక్షిస్తారు.