Tuesday, November 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపత్తి రైతు కన్నీళ్లు తుడిచేదెవరు?

పత్తి రైతు కన్నీళ్లు తుడిచేదెవరు?

- Advertisement -


మార్కెట్‌కు వచ్చింది 3500 బస్తాలు..గరిష్ట ధర రూ.6880
ఏనుమాముల మార్కెట్‌లో ప్రయివేటు వ్యాపారులదే హవా
నవతెలంగాణ-కాశిబుగ్గ

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలుపై కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పెట్టిన కఠిన నిబంధనల వల్ల రైతులు భారీగా నష్టపోతు న్నారు. వరంగల్‌ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం 3500 పత్తి బస్తాలు రాగా గరిష్ట ధర రూ.6880, కనిష్ట ధర రూ.5000, మోడల్‌ ధర రూ.6300 పలికింది. గతేడాది ఇదే సీజన్‌లో సుమారు 20వేల బస్తాలు రాగా ఈసారి కురిసిన అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గింది. కాగా, 8 శాతం తేమ ఉంటేనే ప్రభుత్వ మద్దతు ధర రూ.8110 ఇస్తున్నారని, 12శాతం దాటితే పత్తినే తీసుకోవడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు కారణం గా తేమ తగ్గగా.. రైతులు రోజుల తరబడి ఎండ బెట్టినా ప్రయోజనం ఉండటం లేదు. దాంతో క్వింటాల్‌ రూ.6800కు ప్రయివేట్‌ వ్యాపారులకు అమ్మక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. దాంతో పత్తి రైతుకు క్వింటాల్‌ రూ.1300 వరకు నష్టం వస్తుంది. కాగా, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రెండు నెలలుగా ప్రయివేట్‌ వ్యాపారులు 1,29,523 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, సీసీఐ అధికారులు 59,407 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్టు మార్కెట్‌ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -