Monday, December 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వచ్చారాంటే..?

కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వచ్చారాంటే..?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి పట్టుమని పది నిమిషాలు కూడా సభలో ఉండకుండా తిరిగి ఇంటికి వెళ్లిపోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జాతీయ గీతం జన గణ మన అవగానే సభ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.
కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వచ్చారాంటే..?
వాస్తవానికి సభను కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారైనా నిర్వహించాలన్న రూల్ ఉంది. దాని ప్రకారమే ఎమ్మెల్యేలు కూడా కనీసం ఆరు నెలలకో సారైనా వచ్చి సంతకం పెట్టాల్సి ఉంది. చివరి సారిగా మార్చి 12న అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. ఆ తర్వాత ఆరు నెలలకు ఆగస్టులో నిర్వహించిన సమావేశాలకు హాజరు కాలేదు. సంతకం కూడా చేయలేదు.  ఇప్పుడు కూడా వచ్చి సంతకం చేయకపోతే సభా నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుందని, ఆయన శాసన సభ్యత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలియడంతో కేసీఆర్ సోమవారం శాసన సభకు హాజరై సంతకం చేసి వెళ్లిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -