మతమార్పిడులంటూ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
ఈ చర్యల వెనుక ఎవరైనా ఉన్నారా?
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై సీఐడీ ప్రశ్నల వర్షం
నా భార్యను ఎందుకు పిలిచారు?
108 బులెట్లు కాల్పులు జరిపిన సీపీని ఎందుకు ప్రశ్నించరు?
ఎదురు ప్రశ్నించిన ఎమ్మెల్యే
వీణవంక ఘటనపై మూడున్నర గంటలపాటు సాగిన విచారణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని సీఐడీ అధికారులు శనివారం మూడున్నర గంటల పాటు విచారించారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఈ ఏడాది జనవరి 29న జరిగిన ఘటనపై సీఐడీ ఇచ్చిన నోటీసు మేరకు కౌశిక్‌రెడ్డి తన భార్య షాలినిరెడ్డితో సహా హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు లక్డీకాఫూల్‌లోని సీఐడీ కార్యాలయానికి కౌశిక్‌రెడ్డి దంపతులు చేరుకున్నారు. సీఐడీ అదనపు ఎస్పీ అశోక్ పర్యవేక్షణలో డీఎస్పీ రంగస్వామి నేతృత్వం లోని సీఐడీ బృందం ఎమ్మెల్యేను విచారించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో వీడియో చిత్రీకరణ చేస్తూ సీఐడీ అధికారుల దర్యాప్తు సాగింది. ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వీణవంక వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను ఎందుకు దుర్భాషలాడారు? వారి విధులను ఎందుకు అడ్డుకున్నారు?అని అధికారులు ఎమ్మెల్యేను ప్రశ్నించారని తెలిసింది. అయితే ఎమ్మెల్యే అయిన తనకు సరైన ప్రొటోకాల్ ఇవ్వకుండా పోలీసులే తన పట్ల అవమానకరంగా ప్రర్తించారని కౌశిక్‌రెడ్డి సమాధానమిచ్చినట్టు సమాచారం. మరి ఎందుకు వారి విధులను అడ్డుకు న్నారని పదేపదే పోలీసులు ప్రశ్నించగా.. తన వైపు నుంచి అంత దురుసు ప్రవర్తన ఏమీ లేదని ఎమ్మెల్యే జవాబిచ్చినట్టు సమాచారం. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ మీరు చేసిన ఆరోపణల్లో నిజమెంత? ఏ ఆధారాలతో మీరు ఆ విధంగా ఆరోపణలు చేశారు? ఇది మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టటం కాదా? అని కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించగా.. దానికి కౌశిక్‌రెడ్డి నేరుగా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. సమ్మక్క-సారలమ్మ వంటి భారీ జాతరలో బాధ్యత గల ఎమ్మెల్యే అయిన మీరు అధికారులకు అడ్డంకులు సృష్టించడం ద్వారా మీరు ఏం సాధించదల్చుకున్నారు, ఈ విధంగా ప్రవర్తిం చడం వెనుక మీ పైవాళ్ల ప్రోత్సాహం ఉందా? అనే ప్రశ్నకు కూడా ఎమ్మెల్యే స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. అయితే ఈ విచారణకు తన భార్య షాలినిరెడ్డిని ఎందుకు పిలి చారని కౌశిక్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారని సమా చారం. అలాగే కరీంనగర్ సీపీ 108 బుల్లెట్లను కాల్పులు జరిపారు, దానిపై విచారణ జరిపించరా? అని కూడా కౌశిక్ అధికారులను ఎదురు ప్రశ్నిం చినట్టు తెలిసింది. మొత్తం మీద మధ్యాహ్నం ఓ గంట పాటు లంచ్ విరామం మినహా దాదాపు మూడున్నర గంటల సేపు కౌశిక్‌రెడ్డిని దర్యాప్తు అధి కారులు విచారించి, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సీఐడీ అధికారులు ఆయనకు తెలిపారు.
అనంతరం సాయంత్రం దాదాపు 4 గంటల ప్రాంతంలో కౌశిక్‌రెడ్డి బయటకు వచ్చారు. సీఐడీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లా డారు. తన నియోజకవర్గంలో డంపింగ్‌యార్డ్ నిర్మాణంపై తాను నిరసన చేపడదామనుకున్న రోజునే విచారణ చేపట్టారని అన్నారు. తనను హుజురాబాద్ వెళ్లనివ్వకుండా నోటీసులు ఇచ్చి కావాలనే విచారణకు పిలిచారని ఆరోపించారు. తనతో పాటు తన సతీమణికి సీఐడీ అధికారులు ఎందుకు నోటీసులు ఇచ్చారో తనకు అర్థం కావడం లేదని పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. సీఐడీ నోటీసులు ఇవ్వాల్సి వస్తే 108 సార్లు ఫైరింగ్ జరిపిన కరీంనగర్ సీపీకి ఇవ్వాలనీ, చట్టాన్ని గౌరవించాలి కాబట్టి తాను సీఐడీ విచారణకు హాజరయ్యానని ఎమ్మెల్యే చెప్పారు.
పోలీసులను ఎందుకు దుర్భాషలాడారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



