Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండ్రగ్స్‌పై బీజేపీ ఎందుకు నోరు మెదపదు?

డ్రగ్స్‌పై బీజేపీ ఎందుకు నోరు మెదపదు?

- Advertisement -

పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు విషయంలో బీజేపీ ఎందుకు నోరు మెదపటం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలను వాడుతూ ఇటీవలే మాజీ ఎమ్మెల్యే, మరో ఎంపీ అడ్డంగా దొరికిపోయారని ఆయన గుర్తు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహేశ్‌ మీడియాతో మాట్లాడుతూ…డ్రగ్స్‌పై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు కుప్పలు తెప్పలుగా దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఆ పార్టీకి చెందిన యువ నాయకుడి బృందం మొత్తం ఈ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావమరిది ఫామ్‌ హౌజ్‌లో దొరికితే, ఆయన సన్నిహితుడు దుబాయ్ కు పారిపోయాడని గుర్తు చేశారు. మరికొందరి నేతల వ్యవసాయ క్షేత్రాల్లో కోళ్ల పందాలు నడుస్తున్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నేతలకు ఎందుకు పట్టటం లేదని నిలదీశారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌.. బీజేపీలో కలవనుందని, అందుకే కమలం పార్టీ నేతలు డ్రగ్స్‌ వ్యవహారంలో పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

డిప్యూటీ సీఎం కుమారుడి రిసెప్షన్‌కు సీఎం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్యకు ఇటీవల వివాహమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులను ఈ సందర్భంగా సీఎం ఆశీర్వదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -