Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతుకు న్యాయం చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు.. 

రైతుకు న్యాయం చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు.. 

- Advertisement -

యూరియా బస్తాలు ఇవ్వకుంటే ఇవ్వకుంటే ఎక్కడికైనా సిద్ధం
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోతు కవిత 
రోడ్డుపై ఆడబిడ్డలను నిలబెట్టడం ఈ ప్రభుత్వానికి సరైనది కాదు
నవతెలంగాణ – నెల్లికుదురు 

రైతన్నలు వ్యవసాయం చేసుకుంటుంటే పంటకు సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా బస్తాలు ఇవ్వకపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని బిఆర్ఎస్ పార్టీ మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోత్ కవిత ప్రభుత్వం పై మండి పడినట్టు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమీపంలో రోడ్డుపై రైతులు సుమారు 500 మంది పైగా రాస్తారోకో చేస్తున్న క్రమంలో మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతన్నలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు పండించుకుందాం అన్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పడం తప్ప కనీసం రైతుకు కావలసిన యూరియా బస్తాలు ఇవ్వకపోవడం ఎంతవరకు ఈ ప్రభుత్వానికి సమంజసమని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి రైతులకు ఏం కావాలి ఎంత కావాలి అని ముందస్తు ప్రణాళికలు వేసి అవసరం లేకున్నా కూడా ఉన్నట్టుగా భావించి తెప్పించి రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతన్నల ను కాపాడిందని అన్నారు.

మహిళలు రోడ్డుపై ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా బస్తాల కోసం పిల్లలను తీసుకొని వచ్చి కడి కాపులు కాస్తున్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుకు కావలసిన యూరియా బస్తాలు ఇవ్వకపోవడం బాధాకరo అన్నారు. అధికారులు కూడా ఎందుకు గుర్తించి పనులు చేయడం లేదో అర్థం కావడంలేదని తెలిపారు. పంట నష్టం జరిగినంత ప్రభుత్వం ఏరియా బస్తాలు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు రైతులు కావాల్సిన సూర్యా బస్తాలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సుమారు గంటన్నర పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించి ఉంటుంటే స్థానిక పోలీసులు ఎస్ఐ చిర్ర రమేష్ బాబు తన సిబ్బందితో అంతరాయం లేకుండా బందోబస్తు నిర్వహించారు సంబంధిత శాఖ అధికారి ఏవో యాస్మిన్ తో మాట్లాడి రైతులకు కావాల్సిన ఈరను ఇస్తారా లేదా అన అడిగి  వెంటనే తెప్పించాలని త్వరగా వెంటనే అధికారి తెప్పిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరివింప చేశారు .

అనంతరం నెల్లికుదురు మండల కేంద్రంలో మాల కులస్తులు ఆధ్వర్యంలో నిర్మించిన ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షురాలు కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు తరుపాటి వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనివాస్ ఎంపిటిసి ల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భీముడు ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల జగ్గయ్య వీరగాని మల్లేశం గౌడ్ పులి రామచంద్ర ఆదిరెడ్డి యాసం రమేష్ బిక్కు నాయక్ వరిపల్లి వెంకట్ మాల కుల పెద్దలు అశోద భాస్కర్ , మయ్య వెంకన్న , గార ఉపేందర్ , పత్తి దర్గయ్య , దాసరి యాకయ్య , రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad