భారత్‌పై అమెరికా వాణిజ్యమంత్రి అక్కసు
న్యూయార్క్: దేశంలో 140 కోట్లమంది ఉన్నారని గొప్పలు చెప్పుకొనే భారత్.. తమ దగ్గరి నుంచి గుప్పెడు మొక్కజొన్నలూ కొనడం లేదని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హౌవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. అగ్రరాజ్యంపై విధిస్తున్న సుంకాలను తగ్గించాలని, లేదా తమతో వ్యాపారం విషయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సిందేనని నోరుపారేసుకు న్నారు. పెద్దఎత్తున సుంకాలు విధిస్తూ.. భారత్, కెనడా, బ్రెజిల్ వంటి కీలక మిత్రదేశాలతో విలువైన సంబంధాలను సరిగ్గా నిర్వహిస్తున్నారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానం చెప్పారు. ”భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయి. వారు ఇక్కడ విక్రయాలు చేపడుతూ.. ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రపంచంలో గొప్ప వినియోగదారుడి తో వ్యాపారం విషయంలో కష్టకాలం తప్పదు” అని లుట్నిక్ వ్యాఖ్యానించారు.
మా మొక్కజొన్న ఎందుకు కొనదు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES