మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం..
నెల గడిచినా అందని పరిహారం..
రాష్ట్రవ్యాప్తంగా వెంటనే రైతులకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలి..
యాసంగికి రైతులకు పోచారం నీరు అందించాలి..
ముంపుకు గురైన మంత్రుల జాడలేదు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ఆగస్టు నెల 27న భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు నాగిరెడ్డిపేట మండలంలో రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ ఎలాంటి సహాయం అందించలేదని, నెల రోజులు గడిచినా వరద బాధితులను ఆదుకొని వాడివి నువ్వేం ముఖ్యమంత్రివి అయ్యా అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు. నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా ప్రాంతంలో ముంపుకు గురైన పంటలను ఆదివారం రోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన చేసి వరద బాధితులని ఆదుకుంటామని చెప్పి నెల గడిచినా ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని హరీష్ రావు అన్నారు.
జిల్లాలో ప్రాణా నష్టం ఆస్త నష్టం జరిగిన ఇప్పటికీ ఎలాంటి సహాయం చేయలేదని ఆయన అన్నారు. జిల్లా అధికారులు రూ.344 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని రిపోర్టు పంపిన నేటికీ 34 రూపాయలు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. రోడ్లు తెగిపోయిన చెరువులు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది చెరువులకు కాలువకు గండ్లు పడ్డాయి కానీ ఇప్పటికీ పునరుద్ధరణ చేపట్టలేదు అన్నారు. ముఖ్యమంత్రి కామారెడ్డి ఎల్లారెడ్డి మధ్య ఉన్న బ్రిడ్జ్ తెగిపోయి పరిశీలించడం జరిగింది కానీ నేటికీ రాకపోకలు ప్రారంభించలేదు అన్నారు. నేటి వరకు ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వరకు బస్సులు నడవడం లేదు. ఆర్టీసీ బస్సులు నడవలేక విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి యుద్ధ పాతిపకన పనులు నిర్వహిస్తామని మాటలకే పరిమితం కావడం జరిగింది. రివ్యూ నిర్వహించడం కానీ పనులు ప్రారంభించడం గాని చేయలేదు అన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క పర్యవేక్షించింది లేదు బ్రిడ్జి మరమ్మతులు చేయించింది లేదు. ఇప్పటికి కూలిపోయిన ఇండ్ల బాధితులకు రూపాయి కూడా అందించలేదు. ముఖ్యమంత్రి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పంటలు ఇసుకమేటలు వేయడం జరిగింది.
వేలాది ఇల్లు కూలిపోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు నయా పైసా కూడా బాధితులకు సాయం చేయలేదు ఎందుకు అన్నారు. ఎకరాకు తక్షణ ఆర్థిక సహాయం 10వేలు అందిస్తామని చెప్పి ఈరోజు వరకు పైసా సాయం చేయలేదు. యూరియా ఇవ్వలేక, బోనస్ ఇవ్వలేక రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో వరద ముంచేసిన ప్రభుత్వం నుంచి సహాయం శూన్యంగా ఉంది. యూరియా దొరకక రుణమాఫీ పూర్తిగా గాక రెండు పంటలకు రైతుబంధు రాక ఇబ్బంది పడుతున్న రైతులను వరద ముంచేసింది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. జిల్లాకు మంత్రి ఇయ్యలేదు ఇన్చార్జి మంత్రి ఇటు రానే రారు. తక్షణమే రైతులకు రాష్ట్రవ్యాప్తంగా ఎకరాకు 25 వేల ఆర్థిక సాయం అందించాలి. ఇల్లు కూలిన వారికి 1,10, వేలు తక్షణ సహాయం అందించి. అదేవిధంగా కొత్త ఇంటిని మంజూరు చేయాలి. పోచారం ప్రధాన కాలువకు నాలుగైదు బండ్లు పడిన ఇప్పటికీ గండ్లు పూడ్చి నీళ్లు ఇవ్వడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి లేదు ఇరిగేషన్ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడతారు రైతులకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. తక్షణమే పోచారం ప్రధాన కాలువను గండ్లు పడ్డ గండ్లను మరమ్మతులు నిర్వహించి యాసంగి పంటలకు వెంటనే నీళ్లు విడుదల చేయాలన్నారు.
కామారెడ్డి మెదక్ జిల్లాలో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఇప్పటికీ రూపాయి సహాయం చేయలేవు ఇంకెప్పుడు ఇస్తావ్ అనేసి ప్రశ్నించారు. ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలకు ఎక్కువ చేతులకు తక్కువ అన్నారు. ఒక బ్రిడ్జి కూడా రిపేర్ చేయలేదు ఇప్పటికి ఇన్చార్జి మంత్రి రారు ముఖ్యమంత్రి మాటలకు విలువనే లేదు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిపోర్టులు తెప్పించి వెంటనే తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ప్రమాదం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నాగిరెడ్డిపేట మండల వ్యాప్తంగా ముంపుకు గురైన పంటల వివరాలను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్, జనార్ధన్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, కామారెడ్డి బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కృష్ణ, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ చైర్మన్ రాజారెడ్డి, కపిల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వంశీగౌడ్, హనుమాన్ రెడ్డి, సంతోష్ గౌడ్, కాంత్ రెడ్డి, లక్ష్మీకాంతం, ఫరీద్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.