సీపీఐ(ఎం), పలువురు వామపక్ష నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-కామారెడ్డి
ప్రజాపాలన ప్రభుత్వానికి ఉద్యమకారులంటే భయం ఎందుకని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నరసింహులు ప్రశ్నించారు. కామారెడ్డిలో గురువారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఉదయమే కామారెడ్డిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరాం, తదితర నాయకులను ఇంటి వద్దే అరెస్టు చేశారు. భిక్కనూర్‌లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నరసింహులును పోలీసులు అరెస్టు చేసి భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, కొత్త నరసింహులు మాట్లాడుతూ.. ఇది ప్రజా పాలన, ప్రజాస్వామ్య పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం పర్యటన సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేవాళ్లను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిరంతరం కమ్యూనిస్టులు ఉండా లని మాట్లాడే ముఖ్యమంత్రి అరెస్టులకు పురిగొల్పడం సరైంది కాదన్నారు. కాగా, ఎంసీపీఐ(యూ) కామారెడ్డి జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి దశరథ్ బాలరాజ్, నాయకులు వినోద్‌నూ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రజాపాలన ప్రభుత్వానికి.. ఉద్యమకారులంటే భయం ఎందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES