- Advertisement -
– పడమర వైపు గోడ కట్టినట్లుగా నల్లగా మారింది
– తూర్పు వైపు ఎర్రని తెరల మారింది
– వింతగా చూసి భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు
నవతెలంగాణ – ఊరుకొండ : నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో శనివారం ఆకాశంలో పడమర వైపు నల్లగా గోడ కట్టినట్లు ఏర్పడడంతో.. ఆకాశం ఎందులో నల్లబడ్డది అని పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. తూర్పు వైపు ఎర్రని తెరల మారడం మండల ప్రజలు ఆశ్చర్యానికి గురి కావడమే కాకుండా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్లీ మొంతా తుఫాన్ ముంచుకొస్తుందో.. లేక వాతావరణంలో వింత మార్పులు ఏమైనా చోటు చేసుకుంటాయేమోనని పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
- Advertisement -



