Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచేపల మార్కెట్‌పై నిర్లక్ష్యమెందుకు?

చేపల మార్కెట్‌పై నిర్లక్ష్యమెందుకు?

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ – స్టేషన్‌ ఘనపూర్‌
జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్‌ పట్టణంలోని పల్లగుట్ట క్రాస్‌ సమీపంలో మత్స్యకారుల చేపల విక్రయానికి చేపల మార్కెట్‌ ఏర్పాటు కోసం నాలుగేండ్ల క్రితం శంకుస్థాపన జరిగిందని, నేటికీ పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. బుధవారం మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మునిగేల రమేష్‌తో కలిసి రోడ్డు పక్కన చేపలు అమ్ముకుంటున్న మత్స్యకారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులకు చేపల మార్కెట్‌ లేకపోవడంతో జాతీయ రహదారి పక్కన చేపలు అమ్ముకుంటున్నామని చేపల విక్రయదారులు వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపక్కన వ్యాపారం చేసుకుంటున్న క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదన్నారు. తక్షణమే మార్కెట్‌ పనులను ప్రారంభించేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరారు. చేపలకు మద్దతు ధర ప్రకటించాలని తెలిపారు.

ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని, చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాలని కోరారు. గ్రామాల్లో మత్స్యకారుల జీవనస్థితులు అట్టడుగు స్థాయిలో ఉన్నాయని, వారికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మహిళా సొసైటీలకు సొసైటీకి రూ.20 లక్షల చొప్పున రుణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చేపలు పట్టే సమయంలో, అమ్ముతున్న క్రమంలో ప్రమాదాలకు గురై చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఇన్సూరెన్స్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 50 ఏండ్లు దాటిన మత్స్యకారులకు పెన్షన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ పర్యటనలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ, గొర్రెల, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్‌, మత్స్యకారులు శాగ రాజు, గోనెల ఉమ, గోనెల స్వప్న, రమ, బూర్ల ఊర్మిళ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -