Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్వాతిముత్యంలా సెంటిమెంట్‌ డ్రామాలెందుకు?

స్వాతిముత్యంలా సెంటిమెంట్‌ డ్రామాలెందుకు?

- Advertisement -

– కేసీఆర్‌ సిట్‌ విచారణపై మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఫోన్‌ ట్యాపింగ్‌తో సంసారాల్లోకి తొంగిచూసిన వారు స్వాతిముత్యం మాదిరిగా సెంటిమెంట్‌ డ్రామాలాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అంటే బ్లాక్‌ మెయిలింగ్‌ సమితి అని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ రాచరిక పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్నారనీ, చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తుచేశారు. చట్టం ఎవరికి చుట్టం కాదనీ, గతంలో పలువురు ముఖ్యమంత్రులు విచారణలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ తీవ్రమైన నేరమని అన్నారు. కేసీఆర్‌ ఆదేశాలు లేకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలు, సినీతారల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారని ఆరోపించారు. 70 ఏండ్ల వయస్సులో గద్దర్‌ను ప్రగతి భవన్‌ ముందు వెయిట్‌ చేయించినప్పుడు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను తలుపులు బద్ధలు కొట్టి తీసుకెళ్లినప్పుడు వయస్సు గుర్తుకు రాలేదా? అని ఆయన బీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉన్నవారు ఎంతటివారైనా సరే శిక్షార్హులేననీ, నోటీసులు ఎవరికైనా శాశ్వత చిరుమానాకే ఇస్తారని తెలిపారు. కేసీఆర్‌ విచారణకు సోనియాగాంధీకి ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా కేసీఆర్‌ సిట్‌ విచారణపై డీసీసీలు తక్షణమే స్పందించాలని ఆయన ఆదేశించారు.కేసీఆర్‌ను సిట్‌ విచారణకు ఎందుకు పిలవకూడదు? అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. తప్పు చేయకుంటే విచారణ ఎదుర్కోకుండా రాస్తారోకోలు, నిరసనలు ఎందుకని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. నిజాయితీపరులైతే ఒక్కరే వచ్చి విచారమకు హాజరైతే బాగుండేదని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా? అని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. సొంత అల్లుడి ఫోన్‌ ఎందుకు ట్యాప్‌ చేశారో బీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌ ను నిలదీయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ సూచించారు. కేసీఆర్‌ సిట్‌ విచారణపై బీఆర్‌ఎస్‌ నాయకుల హడావుడి చేస్తున్నా రంటూ పలువురు కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -