Friday, January 9, 2026
E-PAPER
Homeజిల్లాలుకాలేశ్వరానికి ఇచ్చిన ప్రాధాన్యత పాలమూరుకు ఎందుకు ఇవ్వలేదు

కాలేశ్వరానికి ఇచ్చిన ప్రాధాన్యత పాలమూరుకు ఎందుకు ఇవ్వలేదు

- Advertisement -

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
నవతెలంగాణ – వనపర్తి 

పాలమూరు రంగారెడ్డి నిర్మాణం పై నేడు ఆపు సోపాలు పడుతూ యాత్ర నిర్వహిస్తున్న నాయకులు, ఆనాడు కెసిఆర్ ను పాలమూరు రంగారెడ్డి నిర్మాణం పై ఎందుకు ప్రశ్నించలేదని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. కాలేశ్వరం నిర్మాణం పై పెట్టిన శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి నిర్మాణం పైన ఎందుకు పెట్టలేదని వారు ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా కర్వేన రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం భూత్పూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పటి సి ఎం కే సి ఆర్ అప్పటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేయి ఇక్కడే ఉండి పూర్తి చేసి పోతానని చెప్పి మీ ప్రభుత్వం అధికారం పోయే వరకు ఎందుకు పూర్తి చేయలేక పోయారని విమర్శించారు.

బుధవారం జిల్లా కేంద్రం లోని నందిని సులో గల ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి ఆయన మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా 2023 లో నార్లపూర్ దగ్గర ఒక మోటారు ఆన్ చేసి అక్కడి నుండి చెంబులతో నీళ్లను తెచ్చి ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి గుడి దగ్గర జలాభిషేకం కార్యక్రమం ను అప్పటి బి ఆర్ ఎస్ నాయకులు చేసారని నార్లపూర్ లో మోటారు ఆన్ చేసినంక హెలికాప్టర్ లో కే సి ఆర్ ఇంటికి వెళ్లే వరకు మోటార్ బంద్ అయ్యిందన్నారు. అధికారం పోయిన తరువాత రెండు సంవత్సరాలకు  నిద్ర లేచిన కే సి ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అసెంబ్లీ కి వచ్చి మూడు నిముషాలు ఉండి వెళ్లిపోవడం హాస్యాస్పదమన్నారు. 

పది సంవత్సరాల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేయకుండా ఎందుకు పెండింగ్ లో పెట్టారని అధికారం లో ఉన్నప్పుడు అడుగలేక పదవి పోయిన తరువాత ప్రజలు తమను మరిచిపోతారని ఉమ్మడి జిల్లా మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లకు పని పాట లేక ప్రాజెక్టు ల పేరుతో విహారయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ 27 వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు లో తల తోక లేకుండా పనులు చేసారని ఒక ప్రాజెక్టు లో పని పూర్తి కాకముందే ఇంకో ప్రాజెక్టు కు టెండర్లు పిలిచి వారి కమిషన్లు దండుకున్నారన్నారు. రూ 27 వేల కోట్లలో రూ 15 వేల కోట్లు పంపుల కోసం ఖర్చు చేసి కమిషన్లు జేబు నింపుకున్నారని చెప్పారు. మొత్తం 57 వేల కోట్లకు డిపి ఆర్ అనుమతి కోసం పెట్టినప్పుడు రూ 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పనులు పూర్తి అయ్యాయని బి ఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు కదా ఎట్లా పూర్తి అయ్యినట్లు ఆ నాయకులే ప్రజలకు వివరించాలని సూచించారు.

ఉమ్మడి పాలమూరు లో ప్రాజెక్టు లను పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ప్రాజెక్టు ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది గడిచిన 10 ఏండ్ల కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు ల కోసం ఎంత ఖర్చు చేసింది అన్న విషయం పై చర్చ కు సిద్ధమా అని ఎమ్మెల్యేలు సవాలు విసిరారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సి ఎం రేవంత్ రెడ్డి అని 14 నియోజకవర్గం లలో ప్రతి గ్రామం, పట్టణం అభివృద్ధి చేసే బాధ్యత సి ఎం పై ఉందని అందులో భాగంగానే నేడు గ్రామ గ్రామాన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. 

నీవు సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను వనపర్తి ఎమ్మెల్యే నీవు పిచ్చి పిచ్చి గా మాట్లాడితే  ఊరుకునేది లేదని కేటీఆర్ ను హెచ్చరించారు. ప్రాజెక్టు లను పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన 10 ఏండ్లు కాలంలో ప్రాజెక్టు ల్లో ఎంత ఖర్చు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసామో చర్చకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. సి ఎం రేవంత్ రెడ్డి భూత్పు ర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాలమూరు కు సంవత్సరానికి రూ 25 వేల కోట్ల చొప్పున లక్ష కోట్లు కేటాయించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారని వారు గుర్తు చేశారు. పాలమూరులోని 14 నియోజకవర్గాల్లో నియోజకవర్గాలకు సాగు, తాగు నీటి  తోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి పనులు చేసే బాధ్యత సి ఎం తీసుకున్నారని వారు చెప్పారు. కేవలం తాగునీటి కోసం పాలమూరు రంగారెడ్డి నిర్మిస్తున్నామని అనుమతులు  పొందిన మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పై మాట్లాడే అర్హత కోల్పోయారని వారు అన్నారు. 

ఇలా వచ్చి అలా వెళ్లారు : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
రెండు సంవత్సరాలు నిద్ర పోయి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి నిద్ర లేచి నీళ్ల దోపిడీ అని మాటలు మాట్లాడి అసెంబ్లీ కి వచ్చి తోలు తీస్తా అని కే సి ఆర్ ప్రెస్ మీట్ లో చెప్పి తీరా అసెంబ్లీ కి ఇలా వచ్చి అలా వెళ్లారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాలో గతంలో మంత్రులుగా ఎమ్మెల్యే లుగా పని చేసిన వాళ్లు విహారయాత్ర చేసి ఎక్కడో ఒక దగ్గర సమావేశం పెట్టి ఎప్పుడు మాట్లాడని వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. కృష్ణ నీటి, పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు మీద విశ్లేషణ చేసిండు కాళేశ్వరం మాదిరిగా ఎంక్వయిరీ చేస్తాం అనే వరకు పారిపోయిండు  ముందు మామా పారిపోయిండు తరువాత వాళ్లు పారిపోయరన్నారు.

కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి అభివృద్ధి పథంలో దూసుకుని పోతున్న విషయం ను చూసి ఓర్వలేక అక్కడ ముఖం లేక పారిపోయి బయటకు వచ్చి ఎం చెబుతున్నారుంటే స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారని చెబుతున్నారన్నారు. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు చెబుతున్నారని తాము అధికారం లో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా మైక్ ఇవ్వలేదు కానీ మీ ప్రభుత్వం లో మాత్రం మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని చెబుతున్నారని ఆయన వివరించారు. గతం లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతి పక్షాలకు ఏనాడూ మాట్లాడానికి అవకాశం ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లో మీరు రండి మీ విలువైన సూచనలు ఇవ్వండి అని సి ఎం చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. 2003 ఆగస్టు 08 లో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తీసుకుని వచ్చింది పాలమూరు రంగారెడ్డి కు జూరాల ద్వారా 90 టి ఎం సి నీళ్లను మూడు లిఫ్ట్ 22 పంపుల ల ద్వారా 10 లక్షల ఎకరాలకు నీళ్లను ఇవ్వచ్చు అని ఉందని అలా కాకుండా నార్లపూర్ నుండి రంగారెడ్డి వరకు నీళ్లు కేవలం 70 టి ఎం సీలు అని ఆయన వివరించారు. 

పాలమూరు రంగారెడ్డి కు అన్యాయం చేసిందే బి ఆర్ ఎస్ పార్టీ అని మన నీళ్లు మనకు దక్కాల్సింది పోయి తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత శ్రీ శైలం నుండి 4 టి ఎం సి ల నుండి 11 టి ఎం సి లు ఆంధ్ర కు వెళ్ళుతుంటే పట్టించు కొనిది మీ బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని రాయలసీమ ను రత్నాల సీమ చేస్తా అని జగన్ ను కలిసి రోజమ్మ ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిన్నది కే సి ఆర్ కాదా అని అయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మదనపురం మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు ప్రశాంత్, వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -