– సీఎం రేవంత్ రెడ్డికి కేజ్రీవాల్‌తో ట్యూషన్ చెప్పిస్తా..: ఆప్ రాష్ట్ర ఇన్‌చార్జి ప్రియాంక కక్కర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పిల్లలకు చదువు కావాలంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారిని చావులకు అప్పగిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర ఇన్‌చార్జి సుప్రీంకోర్టు అడ్వొకేట్ ప్రియాంక కక్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్ల్షాడారు. ఫుడ్ పాయిజనింగ్, పాఠశాలల గేట్లు విరిగిపడిపోవడం, పాఠశాలల ముందు పెద్ద పెద్ద గుంతలు పిల్లలను అస్వస్థతకు గురి చేస్తూ కొంత మంది చనిపో వడానికి కారణమయ్యాయని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాల యాలు, గురుకులాల్లో మౌలిక సదుపాయాల లేమి కొట్టొచ్చినట్టు కనిపిసు ్తన్నా సర్కారుకు పట్టదా? అని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో ఆప్ విద్యారం గానికి 25 శాతం బడ్జెట్ కేటాయిస్తే, తెలంగాణలో కాంగ్రెస్ కేవలం 7 శాతం మాత్రమే కేటాయించిందని గుర్తుచేశారు. విద్యారంగాన్ని ఎలా నిర్వహిం చాలో తెలియకుంటే తమ నేత కేజ్రీవాల్ దగ్గర ట్యూషన్‌కు రావాలని ఎద్దేవా చేశారు. దేశంలో విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆమె విమర్శించారు. గురుకులాల్లో 48 మంది విద్యార్థులు చనిపోయారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని ప్రియాంక విమర్శించారు. బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ సహకరిస్తున్నదని ఆమె ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన వారే కాంగ్రెస్‌లో ముఖ్యస్థానాల్లో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందమేంటో బయటికి రావాలన్నారు. ఢిల్లీలో సెక్యులర్ ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీయే పరోక్షంగా బీజేపీకి సహకరించిందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, ఆప్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బుర్ర రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చదువు కావాలంటే చంపుతారెందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES