Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ నిర్మూలనకు స్నైపర్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

డ్రగ్స్ నిర్మూలనకు స్నైపర్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

- Advertisement -

పస్రా ఎస్‌ఐ ఏ. కమలాకర్
నవతెలంగాణ – గోవిందరావుపేట
ములుగు జిల్లా పోలీసుల సంకల్పిత లక్ష్యం – డ్రగ్స్ రహిత జిల్లా గా మార్చేందుకు  జిల్లా ఎస్పీ శబరిష్ ఐపీఎస్  ఆదేశాల మేరకు, పస్రా సీఐ పి. దయాకర్ పర్యవేక్షణలో గురువారం గోవిందరావుపేటలో పస్రా ఎస్‌ఐ ఏ. కమలాకర్  ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్ స్నైపర్ డాగ్‌ను ఉపయోగించి బస్టాండ్, చౌరస్తా, కిరాణా దుకాణాలు, ఇతర కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, పేలుడు పదార్థాల గుర్తింపులో ఈ డాగ్‌ కీలకపాత్ర పోషిస్తుందని ఎస్‌ఐ కమలాకర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ ఇవి సాధారణ కుక్కలు కావు… డ్రగ్స్, హత్యలు, దోపిడీలకు సంబంధించిన ఆధారాలు కనిపెట్టే శక్తి ఉన్న ట్రైన్డ్ డాగ్స్,” అని వివరించారు. మండలంలో ప్రతిరోజూ విస్తృత తనిఖీలు నిర్వహించడం పోలీసుల భాగస్వామ్యంగా మారిందన్నారు.యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, తమ భవిష్యత్తును కాపాడుకోవాలని కమలాకర్ సూచించారు. “మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న సమాచారం ఉంటే పోలీసులకు వెంటనే తెలియజేయాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం,” అని ఆయన హామీ ఇచ్చారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత జిల్లా దిశగా ములుగు పోలీసులు ప్రతి అడుగూ శ్రద్ధగా వేస్తున్నారని పేర్కొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img