Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభర్త ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

భర్త ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భర్త ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన సుధీర్ కట్కర్, నీమా కట్కర్ (18) ముదిగుబ్బలో బొగ్గులు కాల్చే పని చేస్తుంటారు. ఆదివారం సుధీర కట్కర్‌ను ఫోన్ ఇవ్వమని నీమా కట్కర్ అడిగింది. ఫోన్‌లో ఛార్జింగ్ లేదని చెప్పడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన నీమా గుడిసె సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -