- Advertisement -
అవంతిపురం గ్రామపంచాయతీలో వల్దాసు సుజాత సురేష్
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం గ్రామపంచాయతీలో భార్యాభర్తలు ఇద్దరు గ్రామ పాలకులుగా గెలిచారు. ఆ గ్రామ సర్పంచ్ గా భార్య వల్దసూ సుజాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా గెలిచారు. ఈమె గతంలో ఆ గ్రామ ఎంపిటిసి గా పనిచేశారు. భర్త వల్డసు సురేష్ ప్రస్తుతం ఆ గ్రామంలో పదో వార్డు మెంబర్గా ఎన్నికయ్యారు. ఇరువురు సోమవారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో బాధ్యతలు స్వీకరించారు. వీరితో పంచాయతీ కార్యదర్శి కోడి రెక్క శైలజ, రిటర్నింగ్ అధికారి ధర్మ లు ప్రమాణ స్వీకారం చేయించారు.
- Advertisement -



