Saturday, January 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుక‌ట్టుకున్న భ‌ర్త‌ను పార‌తో త‌లపై కొట్టి చంపిన భార్య

క‌ట్టుకున్న భ‌ర్త‌ను పార‌తో త‌లపై కొట్టి చంపిన భార్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వనపర్తి జిల్లా గోపాల్ పేట మండ‌ల ప‌రిధిలో దారుణం జరిగింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఏదుట్ల గ్రామానికి చెందిన మేక‌ల చిన్న మ‌ల్ల‌య్య‌(40), శివ‌మ్మ దంప‌తులు. తన భార్యకు వేరొకరితో ఎఫైర్ కలిగి ఉందనే అనుమానంతో తరచూ ఇరువురు గొడవ పడేవారు. అయితే వీరిద్ద‌రూ శుక్ర‌వారం కూడా గొడ‌వ ప‌డ్డారు. ఈ క్రమంలో తన భర్త తనను ఊరికే అనుమానిస్తున్నాడని ఆవేశంతో భార్య అక్కడే ఉన్న పారతో చిన్న మల్లయ్య తలపై కొట్టింది. దీంతో చిన్న మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -