ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ / పోచంపల్లి
యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలానికి చెందిన ధోతి గూడెం గ్రామంలో వలస కూలీపై అడవి పంది దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. దోతి గూడెం గ్రామంలో రైతు కూలీ పనిచేస్తున్న ప్రదేశంలోకి అడవి పంది అకస్మాత్తుగా వచ్చి పాలకుర్తి వెంకటేశ్వర్లు (35)పై ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. వారు వెంటనే ప్రధమ చికిత్స కోసం బీబీనగర్ కి తీసుకురాగా, అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్ళవలసిందిగా వైద్యులు సూచించారు. గాంధీ ఆస్పత్రికి సకాలంలో తరలించినందుకు బాధితుడి బంధువులు ఈఎంటి విశ్వం, పైలెట్ చిన్న కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.
వలస కూలిపై అడవి పంది దాడి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



